20, అక్టోబర్ 2020, మంగళవారం

ఏక్ తారలు

1.  మనసు మధనం అనంత సాగరం_పంచభూతాల సాక్షిగా...!!
2.   సంద్రానికెంత ఓర్పో_నీలాకాశం దుఃఖాన్ని పంచుకోవడంలో...!!
3.   మునగడమైతే మునిగాం_కాని బయటికెలా రావాలో తెలియడం లేదే...!!
4.   శూన్యాన్నీ అలంకరించాయి అక్షరాలు_చతుర్ముఖుని చకితుణ్ని చేస్తూ..!! 
5.   పలకరించే మనసుకు తెలుసు_గుప్పెడు గుండె గుట్టేమిటో...!!
6.   కాలానికే సాధ్యం_ఓపలేని కష్టాన్ని దాచేయాలంటే..!!
7.   కల్మషం లేనిదే కాలం_కష్టసుఖాలను తనలో ఇముడ్చుకుంటూ...!!
8.  అన్నీ ధన సంబంధాలే ఇప్పుడు_రక్త సంబంధాలను వెలి వేస్తూ...!!
9.   అసంపూర్ణ ఆకారాలివి_ఆత్మీయతలెరుగని అనుబంధాలుగా మిగులుతూ..!!
10.  కాలానికి తెలుసు సమాధానం_మనం ఎదురుచూడాలంతే..!! 
11.   మనసు తెలిసిన మాటలే అన్నీ_అక్షరాలతో చేరి మమతలందిస్తున్నాయిలా..!!
12.   మనసు దాయలేని మౌనం_జారి పడుతోందిలా అక్షరాల్లో..!!
13.   మాలిమి చేసుకోవడం తెలియాలంతే_మనసేంటి మరేదైనా దాసోహమే...!!
14.   మాటలక్కర్లేకుండా మాయ చేస్తుంది_మనసు చాతుర్యమదేగా...!!
15.  నటిస్తూనే ఉండాలి_చిరునవ్వు చెదరకుండా ఉండటానికి..!!
16.  ప్రశాంతంగా ఉందనుకున్నా_ఏ చప్పుడూ లేని నిశ్శబ్దమని తెలియక...!! 
17.   నీ పరిచయం పాతదే_అక్షరార్చన అనుభూతే సరికొత్తగా ఇలా...!!
18.   చెక్కిలినొదార్చేది కన్నీరేనేమెా_నెచ్చెలి ఎద బరువును దించడానికి..!!
19.   ఎన్నో గురుతులు_నీకు మాత్రమే తెలిసేలా...!!
20.   నీలోనే సమాధానముంది_ఆటుపోట్లు అవగతమైన జీవితం కనుక...!!
21.  అహం ప్రదర్శనే అనునిత్యం_బాధ్యతల నుండి తప్పించుకు తిరిగేవాడికి..!!
22.  నిజాన్ని అస్సలు తట్టుకోలేడు_బతుకంతా అబద్ధంలో బతికేవాడు...!!
23.   మనసుకి భరోసానే_బాధ్యతలు మెాసే మనిషున్నప్పుడు..!!
24.  మనిషి తత్వమే ఇదనుకుంటా_వద్దన్న బంధాల వెంట పరుగులిడుతూ.. !!
25.   సాగించాలి సమరం గెలుపుకై_వెన్నుపోట్లకు ధీటుగా నిలబడుతూ...!!
26.  అక్షరమెంత అనుభవశాలో_జీవితాల గెలుపోటములను సమంగా లిఖిస్తూ..!!
27.  అనుభవాలన్నీ అక్షరాల్లోనే_మనసును తేలిక చేస్తూ...!!
28.   శూన్యంలో వెదుకుతున్నా_అక్షరాలకు అందని భావాలను..!!
29.   అనంతమైపోతున్నా_అక్షయమై అక్షరాల్లో ఇమిడిపోవాలని...!!
30.   కాలం కలను వదిలెళ్ళింది_నన్నక్కడే ఉండిపొమ్మంటూ...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner