28, నవంబర్ 2014, శుక్రవారం

ఈ కలం గళం....!!

మనసు చేతిలోని మారణాయుధం
అక్షర కావ్యాల ఆంతరంగికం
చక్కనైన చిక్కనైన భావాలకు
రుపానిచ్చే అద్భుత వైతాళికం
మదిని తెలిపే మధుర సంతకం
మానసపు చెలిమికి మణి హారం
సమాజపు చేతనానికి అగ్ని కళిక
న్యాయానికి చివరి చిరునామా
రాజ్యాంగపు రూపురేఖల ఆనవాలు
ఎన్నో హృదయ కవాటాల చప్పుడే ఈ కలం గళం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner