24, నవంబర్ 2014, సోమవారం

ఓ చక్కని జ్ఞాపకంగా....!!

నిన్నటి సాహితీ సంబరాల పండుగ తాకిన అంబరాల సంతోషాన్ని కాస్త నేను తీసుకుందామని అంతర్వేదికి
వెళ్ళానా.... నిజంగా కొంచమేంటి బోలెడు సంతోషాన్ని నా వెంట పెట్టుకుని తెచ్చేసుకున్నా... ఇప్పటి వరకు ముఖ పుస్తక పరిచయమే కాని ముఖా ముఖి తెలియని నేను... అక్కడికి వచ్చిన అందరు చిన్నా పెద్దా తేడా లేకుండా పలకరించిన ఆత్మీయ పలకరింపులకు ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలను... ఇంతటి మహద్భాగ్యాన్ని అందించిన సాహితీ సేవకు శిరస్సు వంచి పాదాభి వందనాలు చెప్పడం తప్ప... చక్కని విందు భోజనాలు అంతకన్నా విలువైన సాహితీ విందుల ఆరగింపులు .. ఆ లక్ష్మినారశింహుని సన్నిధిలో.. వర్ణించడానికి మాటలు కూడా చాలని పరిస్థితి...
ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించిన నిర్వాహకుల కృషి అభినందనీయం.... ఎక్కడా లోటు జరగకుండా అందరిని సంతోష సాగరంలో ఓలలాడించిన ఘనత కూడా వారిదే.... ముఖ్య అతిధుల చక్కని మాటలు... ఆట పాటలు అందరిని అలరించాయి.... కాస్త ఆలశ్యంగా మొదలైనా చివరి వరకు ఒక్కరు కూడా భోజన సమయం మించి పోయినా కదలలేదంటే...  ఇంతకన్నా ఇంకేం చెప్పాలి.... ఓ మాట చెప్పనా మళ్ళి ఎవరితో అనకండేం... నన్ను సత్కరించారండోయ్ జ్ఞాపిక, శాలువా, పుష్పగుచ్చంతో.... నా ఇంతటి ఆనందానికి కారమైన ఈ సందర్భానికి చేరువగా నన్ను తీసుకు వెళ్ళిన మా కుటుంబ సభ్యులకు( అమ్మ, మా వారు, మా పిల్లలు) నా కృతజ్ఞతలు... నాకోసమే వచ్చిన నా అనుంగు సోదరికి ఆత్మీయ కృతజ్ఞతలు.... మరో మాట చెప్పనా చిన్నప్పుడు మనకు సినిమా వాళ్ళు కాని గొప్ప పేరున్న వాళ్ళు కాని ఎవరైనా అనుకోకుండా కనిపిస్తే గబా గబా ఫోటోలు దిగేస్తాము కదా ... అలానే ఆత్మీయులు నాతో తీయించుకున్న ప్రతి చిత్రానికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు... ఎందుకంటే అంతటి సంతోషాన్ని నాకు పంచినందుకు..... జీవితంలో ఓ చక్కని జ్ఞాపకంగా మిగిలిపోయింది నిన్నటి రోజు....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner