28, నవంబర్ 2014, శుక్రవారం

ఎంత వెర్రి కోరికో...!!

ఆకలి కేకల ఆర్తనాదాలు నినదించే
ఆలిబిడ్డల జీవన్మరణాల రణాన్ని
ఆర్తిగా చూస్తూ బేలచూపుల బావుటాను ఎగురవేస్తున్నా...
ఆశల రెక్కల అంతఃకరణాన్ని అణగదొక్కి
ఆకాశానికి నిచ్చెనలేస్తూ అధఃపాతాళానికి పడిపోతూ
ఆనందాలను అందుకొనలేక విధాతను నిందిస్తూ
ఆయువు లెక్కలు తప్పులంటూ
ఆరిపోతున్న ప్రాణాలను సమిధలుగా మార్చుకుంటూ
ఆరని చితి మంటలను కాగడాలుగా చేసుకుంటూ
ఆత్మని అణగదొక్కి సోపానాల సింహాసనాలపై
ఆశీనమవ్వాలని ఎంత వెర్రి కోరికో ఈ మృగాలకు...!! 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner