ఎదురు సూపుల ఎద ఏటి గట్టునే ఉండాది
మనువాడినా మావ మసక సీకటైనా రాలేదు
సందె ఎలుగు మెల్లంగ సన్నగిల్లిపోతాంది
సుక్కలన్ని చల్లనయ్య పక్కకు సేరాయి
మబ్బుల్లో మసక ఎన్నెల కమ్మినాది
మనసేమో గుబులుగా ఊసులాడినాది
చెంత లేని జతను చేరగా రమ్మని పిలుస్తూ
యాడికెల్లినాడో ఈ మావ ఏకువైనా రాలేదు
ఈ పొద్దు మా పొద్దంటూ జాగారమే జతయ్యేను
యాదికైనా రాకపోయే ఈ ఎంకి ఏటిజేతును చెప్మా....!!
పై కవిత ఉపశమన తరంగాలు చిత్ర కవితా పోటిలో నన్ను ప్రధమ విజేతగా నిలిపింది ....ఉపశమన తరంగాలు సమూహానికి న్యాయనిర్ణేతలకు నా కృతజ్ఞతలు ... సహవిజేతలకు నా మనఃపూర్వక అభినందనలు.... !!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి