భావానికి భాష అలంకారమైతే
ఆత్మాలంకారానికి వేదిక అంతరంగం
పరిణితుల పరిధులు దాటి ప్రవహించే
ప్రవాహ ఉత్తుంగ భావనా తరంగం
అనుభూతుల నివేదన ఆత్మావలోచన
ఎల్లలెరుగని ఊహా సామ్రాజ్యానికి పట్టమహిషి
మదిలోని అంతరాలను అందించే సాధన యోగం
అంతర్ముఖాన్ని చూపించే మనసు అద్దం
గతానికి వర్తమానానికి మధ్యన వారధిగా
వాస్తవాన్ని శాసిస్తూ కాలంతో పాటుగా
గతంలో పయనించే అంతులేని అనుబంధాల
అద్భుతాల జ్ఞాపకాల జలధి ఈ అంతరంగం....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి