స్రగ్ధర
సంస్కృతంలో స్రగ్ధర చాలా గంభీరమైన వృత్తం. మయూరుడు అనే కవి కేవలం స్రగ్ధరావృత్తాలతో ‘సూర్యశతకం’ రాశాడు.
ఈ విధమైన గమనంతో సూర్యశతకం మొత్తం స్రగ్ధరా వృత్తాలతో గంభీరంగా ఉంటుంది. ఆ ఛందస్సులోని గణాలకూర్పు కూడా అదే విధంగా ఉంటుంది. మ,ర,భ,య,న,న,య,య,య అనే గణాలు వరుసగా వస్తాయి. అన్నీ దీర్ఘాక్షరాలు, కొన్ని త్వరితగతిన ఆవృత్తమవుతాయి. దాని తరువాత హ్రస్వాక్షరాలు కొన్ని. ఈ విధమైన అమరిక ఒక విధమైన గాంభీర్యాన్ని సంతరించుకున్నట్లుగా ఉంటుంది. సంస్కృతంలోని స్తోత్రాలు అన్నీ సామాన్యంగా స్రగ్ధరలోనే ఉంటాయి.
గణ విభజన
UUU | UIU | UII | III | IUU | IUU | IUU |
మ | ర | భ | న | య | య | య |
తెల్లంబై | శైలవి | శ్రాంతిని | మునియ | తినిందే | జరిల్లు | న్ధృఢంబై |
లక్షణములు
ఇది 21వ ఛందమైన ‘ప్రకృతి’లో 299393వ వృత్తము.
గణములు : మ ర భ న య య య
యతులు 2 చోట్ల : 8వ అక్షరము, 15వ అక్షరము
ప్రాస నియమము కలదు.
• | పాదాలు: | నాలుగు |
• | అక్షరాలు ప్రతి పాదంలోనూ: 21 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | మ, ర, భ, న ,య, య, య |
• | యతి : | ప్రతిపాదంలోనూ 8వ, 15వ అక్షరములు |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | ప్రాస యతి చెల్లదు |
ఉదాహరణ 1:
పోతన తెలుగు భాగవతంలో వాడిన స్రగ్ధర వృత్త పద్యాల సంఖ్య: 3కూలున్ గుఱ్ఱంబు లేనుంగులు ధరఁ గెడయుం గుప్పలై; నుగ్గునూచై
వ్రాలు న్దేరుల్ హతంబై వడిఁబడు సుభటవ్రాతముల్; శోణితంబుల్
గ్రోలున్, మాంసంబు నంజుం గొఱకు, నెముకల న్గుంపులై సోలుచు న్బే
తాల క్రవ్యాద భూతోత్కరములు; జతలై తాళముల్ దట్టియాడున్.
స్రగ్ధరా సౌందర్యం...!!
శాలి స్ఫారాబ్జరేఖాంజలి పుట ఘటనాచారు ఫాలస్థల క్ష్మా
పాలశ్రేణీ విశా లాంబక కుముదవనీ బాంధవాయత్తచంద్ర
శ్రీలీలాగాఢ కాంతి స్మితవదనరుచి స్ఫీతు నాగేంద్రకేతున్. (విరాట. 3. 78)
మహాస్రగ్ధర
కొలిచెం బ్రోత్సాహ వృత్తిం గుతల గగనము ల్గూడ రెం డంఘ్రులం దా బలిఁ బాతాళంబు చేరం బనిచె గడమకై బాపురే వామనుం డ స్ఖలితాటో పాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకారిమారన్సతానో జ్జ్వ లసోద్యద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్.
గణ విభజన
IIU | UUI | UUI | III | IIU | UIU | UIU | U |
స | త | త | న | స | ర | ర | గ |
కొలిచెం | బ్రోత్సాహ | వృత్తింగు | తలగ | గనము | ల్గూడరెం | డంఘ్రులం | దా |
లక్షణములు
• | పాదాలు: | నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు. |
• | అక్షరాలు ప్రతి పాదంలోనూ: 22 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | భ, భ, భ, భ, భ, భ, భ , గ (7 భగణములు మరియు 1 గురువు) |
• | యతి : | ప్రతిపాదంలోనూ 9వ, 16వ వ అక్షరములు |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | చెల్లదు |
- 33 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: I I U - U U I - U U I - I I I - I I U - U I U - U I U - U
ఉదాహరణ 1:
కనియెం దాలాంకుఁ డుద్యత్కట చటుల నట త్కాల దండాభ శూలున్
జన రక్తాసిక్త తాలు న్సమధిక సమరోత్సాహ లోలుం గఠోరా
శని తుల్యోదగ్ర దంష్ట్రా జనిత శిఖక ణాచ్ఛాది తాశాంతరాళున్
హనన వ్యాపార శీలు న్నతి దృఢ ఘన మస్తాస్థి మాలుం గరాళున్.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి