10, నవంబర్ 2014, సోమవారం

ఓ కొత్త పరిచయం...!!

నేస్తం....
       ఇప్పటి జీవితాలు చూస్తుంటే నాకు అనిపిస్తోంది ... మనం ఆధునికంగా ఎంత ముందుకుపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు... ఒకప్పుడు కలం స్నేహాలు అప్పట్లో ఎంతో కొంత ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నాయి... చెడు జరిగినా చాలా తక్కువ స్థాయిలోనే ఉండేది.... చక్కని భావాల వారధిలా సాగేవి అప్పటి స్నేహాలు... ఇప్పుడు అలానే ఉన్నాయి చాలా పరిచయాలు... కాని కొన్ని స్నేహాలు ఎందుకో విపరీతంగా అనిపిస్తూ ఉంటాయి... అంతర్జాలంలో ఈ ముఖ పుస్తకంలో ఉండే అమ్మాయిలు/అబ్బాయిలు  అందరు చెడ్డవారు కాదు... అలా అని కొందరు లేరని చెప్పలేము... ఒకొకరు అమ్మాయి పేరు పెట్టేసుకుని స్నేహానికి అనుమతి పంపడము లేదా మరికొందరేమో మరికొంచం ముందుకి వచ్చి వావి వరుసలు, వయసు తారతమ్యాలు చూడకుండా ఇష్టం వచ్చినట్టు రాసేయడం... వాళ్ళకి అన్ని అనుబంధాలు ఉంటాయి కదా... ఈ ముఖ పుస్తకంలోనికి వచ్చినంత మాత్రాన ఇలా ఎంత మాట పడితే అంత మాట అనేయడమే.... పెద్దవారు, చిన్నవారు అని కూడా లేదు... ఈ ఇష్టాలు, ప్రేమలు అన్ని ఆగేది ఒకచోటే.... అదే కోరిక.... నాకు ఇన్ని రోజుల నుంచి చూస్తున్న పరిస్థితిని బట్టి అర్ధం అయ్యింది అదే....
                 ఇన్నాళ్ళ మన స్నేహంలో ఎప్పుడు ఈ ఆడ /మగ తేడాలు కాని... పరిధులు దాటిన సమయం కాని ఎప్పుడు వచ్చిన దాఖలా కనిపించలేదు.... మరి ఈ తేడాలు ఇప్పటి స్నేహాల్లో ఎందుకో... ఈ విపరీత పోకడలు ఎక్కడికి దారి తీస్తాయో అని ఒకింత భయంగా కూడా ఉంది.... ఓ కొత్త పరిచయం అంటే భయంగా కాకుండా బంధంగా అనిపించాలి.... పరిధులు దాటని స్నేహాలు పది కాలాలు పదిలంగా ఉంటాయి... బాధ్యతలు, బాధలు పంచుకున్న ఆత్మీయ బంధాలు చిరకాలం నిలచిపోతాయి మన స్నేహంలా... అందుకే నాకు అత్యంత ప్రీతికరమైన నేస్తంగానే ఉండిపో ఎప్పటికీ.... నీ నెచ్చెలి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner