14, నవంబర్ 2014, శుక్రవారం

కథే ఇది...!!

చీకటి చిక్కబడి
వెన్నెల వెనుకబడి
తారలతో చెప్పిన కథే ఇది

మాటలు తడబడి
అడుగులు జతబడి
మనసుతో చెప్పిన కథే ఇది

మౌనం ముడిపడి
నవ్వులు కలబడి
హృదయంతో చెప్పిన కథే ఇది

చేరువగా నీ సవ్వడి
దూరంగా మది అలజడి
చెలిమితో చెప్పిన కథే ఇది 

వినిపించే అలల సడి
కనిపించే కలల ఒడి
నినదించే కడలి కథే ఇది

ఓటమి వెనుకబడి
విజయం కనబడి
గెలుపుతో చెప్పిన కథే ఇది

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner