8, నవంబర్ 2014, శనివారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఆరవ భాగం....!!

వారం వారం బోలెడు ముచ్చట్లు తెలుగు సాహిత్యం గురించి చెప్పుకుంటున్నాము కదా... ఈ వారం మత్తుగా ఉంటూ హాయిగా సాగిపోయే మత్తకోకిల గురించి.... మత్తకోకిల భలే బావుంటుంది ఈ పేరు వినడానికి... ఇక వృత్తాల విషయానికి వస్తే మత్తకోకిల గమ్మత్తుగా చేసే  గమకాలు పసందుగా ఉంటాయి... మత్తకోకిల వృత్తంలో భాషలకు అమ్మ భాషైన సంస్కృతంతో పాటు తెలుగు,తమిళం, కన్నడ భాషలే కాకుండా సంగీతముతో సమ్మిళితమై ఎన్నో రాగాలు మత్తుగా సాగిపోతుంటాయి మనకు తెలియకుండానే...మన తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం మత్తకోకిల గుణగణాలు కాసిని చూద్దాం.... మా తెలుగు మాష్టారు చెప్పినవే కాకుండా పెద్దలు చెప్పిన నాకు తెలియని ఎన్నో విశేషాలను జోడించి మీతోపాటుగా నాకు నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చిన సాహితీ సేవకు కృతజ్ఞతలతో....

మత్తకోకిల

సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.
 

లక్షణములు

  • ఈ పద్య ఛందస్సుకే చర్చరీ , మల్లికామాల , మాలికోత్తరమాలికా , విబుధప్రియా , హరనర్తన , ఉజ్జ్వల అనే ఇతర నామములు కూడా కలవు.
  • వృత్తం రకానికి చెందినది
  • ధృతి ఛందమునకు చెందిన 93019 వ వృత్తము.
  • 18 అక్షరములు ఉండును.
  • 26 మాత్రలు ఉండును.
  • మాత్రా శ్రేణి: U I U - I I U - I U I - I U I - U I I - U I U
    • మిశ్రగతి శ్రేణి (3-4) : U I - U I I - U I - U I I - U I - U I I - U I -
  • 4 పాదములు ఉండును.
  • ప్రతి పాదమునందు ర , స , జ , జ , భ , ర గణములుండును.
  • ప్రాస నియమం కలదు, ప్రాస యతి చెల్లదు 
  • ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము

    నడక

    • మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
    • తాన తానన తాన తానన తాన తానన తాన తా
    ఉదాహరణ 1
    రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం
    భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో
    రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో
    ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపత
    ఉదాహరణ 2
    అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్‌
    ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతు చై
    తన్యము¦ భువనైకమాన్యము దారుణస్వన భీత రా
    జన్యమున్‌ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున

    మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric" గా ఉందో అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes" రాయవచ్చు!
    మరిన్ని మత్తకోకిల వివరణల కోసం ఈ లింక్ ను చూడండి
    జె కె మోహనరావుగారి వ్యాసంలో చాలా చక్కని వివరాలు మీ అందరి కోసం.....
    http://eemaata.com/em/issues/201207/1964.html?allinonepage=1


    వివరణ - జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సహకారంతో .....
    వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

    0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

    Related Posts Plugin for WordPress, Blogger...
     

    కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner