25, నవంబర్ 2014, మంగళవారం

నయగారపు సంకెళ్ళు...!!

గతమంతా గాయాల గురుతులైనా
బతుకంతా కన్నీటి పాటగా మారినా
ఛాయల చేదు తగులుతూనే ఉన్నా
మరల మరల పలకరించే ఆనవాలు నీ తలపే...

ఏకాంతానికి నే వెళ్ళినా నా వెన్నంటే
నీ అడుగుల సవ్వడి వినిపించినా
ఒంటరి కాని నా పయనం నీతోనే సాగినా
మరల మరల జతగా చేరినవి నీ జ్ఞాపకాలే...

ఓటమి నీడలో చీకటి చేరినా
వెన్నెల దాగని తీరపు తిమిరమే
చుక్కల దుప్పటి పరచిన వెలుగులే
మరల మరల కనిపించిన విజయ సంకేతాలే...

ప్రేమ రాహిత్యాన్ని అక్షర కావ్యాలుగా
సయ్యాటల సంపగి మొగ్గలుగా మార్చినా
దాయలేని కన్నీటి సంద్రాలను మోయలేక
మరల మరల నను చేరే నయగారపు సంకెళ్ళే...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner