11, నవంబర్ 2014, మంగళవారం

కడలి....!!

ఆకశాన్ని చుంబించే ఆహ్లాదాన్ని పంచే
అలల కలల అందమైన కావ్యమా
తీరంలో నీ ఆరాటంలో కనిపించే ఆనందం
లోలోన నీలో దాగిన అంతర్మధనానికి
అందని తార్కాణం నీ ప్రశాంతత
పడిలేచే కెరటాల జీవితం చెప్పే సంకేతం
ఓటమిలో సైతం నేర్పెను సహనం
కోపంలో ప్రళయ ఘీంకారం ఒక్కసారిగా
మృత్యు ఘోషల మరణ మృదంగ నాదం
ఓరిమి అంతరించిన న్యాయానికి గుర్తుగా
మనిషికి నేర్పిన నడకల నడతల పాఠం
సుందర సాగర తీరం అదే అదే
ప్రకృతి వైపరీత్యాల సమ్మేళము అదే
ఆనంద విషాదాలను తనలోనే
ఇముడ్చుకున్న చూడ చక్కని కడలి...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner