అమ్మ పొత్తిళ్ళు తెలియని ఆకలి కేకల్లో
పాల బువ్వల ముద్దుల మురిపాలు
ముచ్చట తీర్చే ముసి వాయనాలుగా
రంగులు వెలసిన బతుకుల చాటున
కతల కన్నీళ్ళు జారుతూ వెక్కిరిస్తున్నా
గడియకో చిరునవ్వు పులుముకుని
ముళ్ళ పూలను అందంగా అమర్చుకుని
వసి వాడని కుసుమంలా ఆహ్వానం పలికే
ఆ రెప్పల మాటున కనిపించని వెతల గొంతులు
వినిపించే అపస్వరాలు అర్ధాంతరంగా
ముగిసే తరుణాల క్షణాల జీవితాలు
బంధనాల బంధాలు పంచుకోలేని
అపవ్యస్త భ్రమణాలుగా మిగిలిపోతూ
కన్నపేగు కదిలినా నమ్మకం మోసపోయినా
వ్యధశిలకు చేరిన వధ శిల్పమై నిలిచిన
రాయని బతుకు అక్షరం ఈ శిధిలాక్షరం...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి