22, నవంబర్ 2014, శనివారం

మధుర వలపులే....!!

సుక్కల్లో ఎదికానే  నిన్ను 
సున్నితమైన చిన్నదానా... 
సుమ గంధంలా అలరించావే
సుతిమెత్తని మనసుదానా...
సుక్కంటి సక్కని కోమలాంగి
సుకుమారంగా సెంత సేరావా...
సుట్టేసిన సల్లగాలి నీ తలపులను
సుతారంగా నాకందించిన క్షణాలు..
సుట్టంలా సూసెల్లిన సూపుల గురుతులు
సుందరాంగిని మరువనివ్వని మధుర వలపులే....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner