1, నవంబర్ 2013, శుక్రవారం

మనిద్దరమే మిగిలిపోయాం....!!

నాటకంలో చివరి అంకంలో మిగిలింది మనిద్దరమే
మనతో ఉన్న మన  జ్ఞాపకాలే...!!
నీకు తెలుసు నా జ్ఞాపకాల గదులన్నింటిలో 
నిండి పోయింది నువ్వే అని...!!
నీకు తెలిసినా ఎందుకో మరి ఆ నిజాన్ని
నిజమే అని ఒప్పుకోలేక పోతున్నావు ఇప్పటికి...!!
వద్దని విసిరి కొట్టావు వదలమంటే వదలనంటావు
దూరంగా పోవు అలా అని దగ్గరగాను రావు...!!
రంగుల వలయాలు చూపించిన రంగుటద్దాలు
తళుకు బెళుకుల పై పై మెరుగులు మాయల మోహాలు....!!
అర్ధం అయినా కానట్టు ఉంటూ అర్ధం కాకుండా ఉంటావు
నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ నన్నూమాయ చేస్తున్నావు...!!
మన మధ్య మొదటి అంకం నుంచి చివరి అంకం వరకు
ఇలానే ఉన్నా....చివరికి మనిద్దరమే మిగిలిపోయాం....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

మాలా కుమార్ చెప్పారు...

నాకు నువ్వు , నీకు నేను .ముదిమిలో అంతేగా :)

vemulachandra చెప్పారు...

"జీవన నాటకంలో చివరికి మిగిలేది మనమూ మన జ్ఞాపకాలే, ఆ జ్ఞాపకాల గదులన్నింటిలో నిన్ను నీవు మోసం చేసుకుంటూ నన్నూమాయ చేస్తున్నావే .... చివరికి మిగిలేది ఇద్దరమే అని మరిచిపోయావా!?"
ఏదీ యాదృశ్చికం కాదు .... ఈ రంగుల వలయాల తళుకు బెళుకుల మాయల మోహాలలో కొట్టుకుపోకు .... అర్ధం అయినా కానట్టు అర్ధం కాకుండా జీవించకు అని ప్రస్తావిస్తూ.
ఒక మంచి కవిత!
అభినందనలు మంజు యనమదల గారు! శుభారుణోదయం!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ స్పందనలో నా మనసుని నా ముందే పరిచారు చంద్ర గారు... అద్భుతమైన విశ్లేషణకు వందనాలు
అవును మాలా గారు ... ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner