7, నవంబర్ 2013, గురువారం

నీ జ్ఞాపకం నాతో...!!

వెంటపడే జ్ఞాపకం
వేధించే జ్ఞాపకం
వెన్నాడే జ్ఞాపకం
మైమరపించే జ్ఞాపకం
మధువొలికించే జ్ఞాపకం
మాసిపోనిది జ్ఞాపకం
మధురమైనది జ్ఞాపకం
మనసు తడిమే జ్ఞాపకం
ఏకాంతానికి సహవాసం జ్ఞాపకం
దూరమైన దగ్గరతనానికి జ్ఞాపకం
చేరువ కాని చెలిమికి జ్ఞాపకం
చెంతన లేని సాన్నిహిత్యానికి జ్ఞాపకం
గతమైన జ్ఞాపకం
ఘనమైన జ్ఞాపకం
నీ జ్ఞాపకం నాతోనే...నీ జ్ఞాపకం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

వెంటాడి, వేధించే జ్ఞాపకాలు, మైమరిపించి, మధువులొలికే మాధుర్యాలు, దూరంగా ఉండి మనసు తడిమే ఘనమైన గతం ఏకాంతాలు అంటూ ....
ఎంతో అందంగా హృద్యమంగా తియ్యదనాన్ని కూర్చిన "నీ జ్ఞాపకం నాతో" మధురంగా చాలా చాలా బాగుంది. అభినందనలు మంజు యనమదల గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

అందమైన మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner