
ఆశయాన్ని పంచుకున్నా
అనుబంధాన్ని పెంచుకున్నా....!!
మనసుతో మాటాడి చెప్పిన భావన
ఆకృతి సంతరించుకున్న స్పందన
చూసుకున్న ఆ క్షణం అనిపించిన నిజం....!!
ఓ అక్షర సత్యమా నాలో ఉన్న నిన్ను
దాచుకున్నా పదిలంగా... అందుకే నిన్ను
అమ్ముకోలేదు...నమ్ముకున్నాను అని...!!
బాధ్యతల ఒరవడిలో అమ్ముకున్నా నిన్ను
బంధమైన నిన్ను బాసటగా చేసుకున్నా
పెంచుకున్న చెలిమిని తెంచుకోలేకున్నా....!!
వృత్తిలో అమ్మకానికి ప్రవృత్తిలో ఇష్టానికి
మనసుకి మనిషికి మధ్య సంఘర్షణలో
తప్పని జీవిత పయనానికి వారధిగా చేసుకున్నా...!!
అమ్మలా క్షమించే హృదయ వైశాల్యం నీది
మన్నించమని మనస్పుర్తిగా వేడుకుంటూ
నమ్ముకున్న అక్షరాణికి వందనం...!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావాతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.
మీ కవిత చదువుతుంటే చటుక్కున తిలక్ మెదిలాడు మదిలో....
చాలా సంతోషం అండి... ఓ మహా కవిని గుర్తు చేసిన నా అక్షరాలూ ... నేను అదృష్టవంతులం....మీకు మనఃపూర్వక వందనాలు
bagundandi
Thank u so much Ashok ... chaalaa rojulaki ... elaa unaaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి