18, నవంబర్ 2013, సోమవారం

నీ సాక్ష్యం కోసం...!!


మనసు మాటున దాచేసింది
చూడనివ్వని రోదన చిత్రాన్నికనిపించకుండా ...!!
చేసిన గాయపు గురుతులు
మాసిపోని మచ్చలుగా అలాగే మిగిలాయి...!!
కాలం వేసే మందు సరిపోలేదు
గతం గుచ్చిన పచ్చబొట్లకు వాస్తవంగా..!!
మాసిన గాయం జ్ఞాపకంగా మారి
తగులుతూనే గుర్తు చేస్తోంది తన ఉనికిని ...!!
ఏ బంధం నాది కాక పోయినా నాదేనంటూ
అల్లుకున్న అనుబంధాలు తెంచుకోలేని ఆచేతనావస్థ...!!
చేతనలోనికి రాని తనువు పడే తపన
చైతన్యమైన మదిని చిద్రం చేసి చంపేసిన ఘనత నీదే...!!
వీడి పోలేని ప్రాణం కొట్టుమిట్టాడుతూ
వదలలేని పాశాలను పెనవేసుకున్న మమకారం....!!
ఆశ నిరాశల్లో మునుగుతూ తేలుతూ
ఊపిరినిచ్చే ప్రాణవాయువు కోసం ఎదురు చూపుల నిట్టూర్పులు...!!
కాల్చేసిన చితిపై మంటలారినా ఆ గాలిలో
వేడి తగ్గని మనసు సెగల ఆవిరి తగులుతూనే ఉంది వెచ్చగా...!!
జీవితంలో జీవాన్ని మొత్తం పీల్చేసినా
ఇంకా జీవశ్చవం మిగిలే ఉంది నీ సాక్ష్యం కోసం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...


"గతం చేసిన గాయాల గురుతులు మాసిపోని పచ్చబొట్ల మచ్చలు జ్ఞాపకాలుగా మారి తనువు పడే తపన, మది చిద్రమై .... ఆ చంపేసిన ఘనత నీదే...!"

"నీ సాక్ష్యం కోసం" కవిత ఆలోచింపచేసేదిలా చాలా బాగుంది. అభినందనలు మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

చక్కని మీ అభినందనకు వందనాలు చంద్ర గారూ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner