13, నవంబర్ 2013, బుధవారం

నీ కంటూ ఎవరు మిగలని రోజు....!!

అర్ధం లేని సంఘర్షణలో లేక వ్యర్ధం అయిన ఆలోచనలో తెలియని అయోమయం....ఇలా ఎన్నాళ్ళు ఈ అంతం లేని అవసరాల నడుమ యంత్రంలా యాంత్రిక జీవితం...!! నువ్వు గెలిచిన నాడు అందరూ నీ చుట్టాలే...అదే ఓటమి చేరువలో నువ్వున్నప్పుడు పడిపోతున్నావని కూడా పట్టించుకోక పారిపోయిన అన్ని బంధాలు...నీకంటూ మిగలని ఏ చుట్టరికమూ...!! నీకంటూ నిన్ను కూడా మిగుల్చుకోలేని నువ్వు...!!
విజయానికి ఎల్లలు లేని ఆనందం హద్దుగా ఉంటే పతనం చుట్టూ పోగైన పరి పరి కారణాలు...నీ చేతగాని తనాన్ని ఎద్దేవా చేస్తూ నవ్వే లోకం...గెలుపు సింహాసనం మీద ఉన్నప్పుడు గుర్తుకు రాని నీ లోపాలు ఓటమి నీ చెంతనున్నప్పుడు ఆ లోపాలే నిను గుచ్చే శులాలు...శరాఘాతాలై కుళ్ళ బొడుస్తాయి జీవశ్చవమైయ్యే వరకు...!!
ప్రతి ఒక్కరు జీవితపు ఆటలో గెలవాలనే ఆడతారు...కాకపొతే నిజాయితీగా కొందరు...అడ్డ దారిలో మరికొందరు...!!
చేజారిన గెలుపు కోసం తపన, ఎప్పటికైనా అందుకోగలమన్న ధీమా చాలదు గెలుపు శిఖరాన్ని చేరుకోవడానికి... ఎన్నో అడ్డంకులు, అవమానాలు దాటుకుని నిరంతర ప్రయత్నమే సాధించబోయే విజయానికి సాక్ష్యంగా ఉండాలి... ఇంటా బయటా ప్రతికూలత ఉన్నా నిన్ను నువ్వు వదులుకోకు..నీ గమ్యం మార్చుకోకు..నీ అసలైన ఆస్థి ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకు...నీకు నువ్వే తోడు నీకెవరులేకున్నా...!! నీకు నువ్వే నేస్తానివి...!! బంధాలు భాధ్యతల నడుమ నలిగినా సడలని సంకల్పం నీది కావాలి...నవ చైతన్యానికి నాంది కావాలి...మొదటి అడుగు నీదే కావాలి...నవ్విన నాప చేను పండును అని నిను చూసి పగలబడిన ఆ నలుగురికి సమాధానం చెప్పగలగాలి...!! మాటలు పడుతూనే ఉంటే అంటూనే ఉంటారు..ఒక్కసారి ఎదురు తిరిగి చూడు...తలలు వంచుతారు...!! ప్రతికూలత ప్రతి ఇంటా ప్రతి జీవితంలోను ఉంటుంది...అయినా అదే సమిధగా చేసుకుని వెలుగుల కాంతులు విరజిమ్మాలి...ఆ వెలుగు తాకిడికి అందరి కళ్ళు తట్టుకోలేక మూసుకు పోవాలి...శులాలు విసిరిన నోళ్ళు మూతబడాలి...రావాలి ఆ రోజు దిగంతాలను దాటుకుంటూ....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"ప్రతికూలత లు ఎన్ని ఎదురైనా నిన్ను నువ్వు వదులుకోకు! నీ గమ్యం మార్చుకోకు! నీ అసలైన ఆస్థి నీ ఆత్మ స్థైర్యం! నీకు నువ్వే నేస్తం! బంధాలు భాధ్యతల నడుమ నలిగినా సడలని సంకల్పం నీది. నవ చైతన్యం దిశగా, మొదటి అడుగు ముందుకు వేసి నిన్ను చూసి నవ్విన ఆ నలుగురూ నీ వెంట నడిచొచ్చేలా, ఆ నలుగురూ నీ విజ్ఞత ముందు తలవంచేలా, శూలాలు విసిరిన ఆ నోళ్ళు మూసుకుపోయేలా ...."

నీకంటూ ఎవరూ మిగలని రోజు .... న .... అందరూ నీవెంటే ఉంటారు. నిజం! మంజు గారు ఉన్నత ప్రేరణాత్మక భావనలనెన్నింటినో ఈ మధ్య మీ రచనల్లో చూస్తున్నాను.

మీకు శుభాభినందనలు.

చెప్పాలంటే...... చెప్పారు...

మనఃపూర్వక వందనాలు మీ అభిమాన స్పందనకు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner