27, నవంబర్ 2013, బుధవారం

అమృతమూర్తి...!!

మువ్వలా ముడుచుకున్న ముగ్ధత్వం
గువ్వలా గూడు చెదిరి బిక్కుమంటోంది...!!
గుబులైన గుండె గొంతు మూగబోయింది
గునపాలై గుచ్చుతున్న చూపుల శరాలను తట్టుకోలేక..!!
మెత్తనైన సున్నితత్వం దారి మరచిపోయి
కఠిన పాషానమైన హృదయాల్లో కరిగి పోయింది...!!
చివ్వున ఉబికిన కన్నీటి చెలమ నిండుతూనే ఉంది
ఆగని రుధిరాన్ని నిలువరించే జాడ లేక...!!
మనసు దాటని మౌనం పెదవి విప్పలేక పోతోంది
కనిపించని గాయాలను చూపించే ధైర్యం లేక....!!
పురుటి నెప్పుల ప్రసవ వేదన వినిపిస్తూనే ఉంది
చూడలేని ఆ వేదన మోదానికి సాక్ష్యం ఎక్కడిది...??
కారణం నువ్వని తెలిసినా ఒప్పుకోలేని అహం నీది
మరో ఊపిరికి రూపానిచ్చే  క్రమంలో....
కష్టాన్ని ఇష్టంగా భరిస్తూ ప్రాణాన్ని ఫణంగా పెట్టే
అసమాన అమృతమూర్తి మాతృ మూర్తి ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

ముగ్ధత్వం, గువ్వ గూడు చెదిరి బిక్కుమంటోంది. చూపుల శరాలు గునపాలై గుచ్చుతున్నాయి. ఎంతటి పాషాణ హృదయమైనా కరిగి పోయేలా ఆ పురుటి నెప్పుల ప్రసవ వేదన, చివ్వున ఉబికిన కన్నీటి చెలమ నిండుతూనే ఉంది. ఆగని రుధిరాన్ని నిలువరించే జాడ లేక...
......
కారణం తెలిసినా ఒప్పుకోలేని అహం ఒకరు. మరో ఊపిరికి రూపానిచ్చే క్రమంలో.... కష్టాన్ని ఇష్టంగా భరిస్తూ ప్రాణాన్ని ఫణంగా పెట్టిన అమృతమూర్తి ఇంకొకరు.

కళ్ళకు కట్టినట్లు దృశ్యం కనిపిస్తుంది. మీ అక్షరావిష్కరణ ద్వారా అన్ని రాగాలనూ అద్భుతంగా పండిస్తున్నారు.
అభినందనలు మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

చక్కని మీ విశ్లేషణకు ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner