2, నవంబర్ 2013, శనివారం

ఏంటో ఈ పలుకుబళ్ళ పరపతుల సంగతి....??

దేవుడి  దగ్గర వైద్యుని దగ్గర మన పరపతి ఉపయోగించడం ఎంత వరకు సమంజసం...??
దేవుడి గుడికి అందరమూ మన కోర్కెలు తీర్చినందుకో లేదా తీర్చమని అడగడానికో....లేదా కాస్త పుణ్యం పురుషార్ధం కోసమో వెళుతూ ఉంటాము సాధారణంగా...!! అక్కడ కూడా ప్రత్యేక దర్శనాలు...పూజలు అవి ఇవి అంటూ ఇప్పుడు దేవుడు కూడా అందని ద్రాక్షలా మారిపోయాడు అది వేరే సంగతి...గొప్ప వారికి దేవుడు వెంటనే దర్శనాలు ఇచ్చేస్తూ సామాన్యులకు సుదూరం గానే ఉంటూ వస్తున్నాడు...!!
ఇక వైద్యం కోసం వెళితే అక్కడా ఇలానే.....డి ఎస్ పి వచ్చారనో... ఏ ఎస్ పి వచ్చారనో వాళ్లకు రాస మర్యాదలు...ముందుగా వాళ్ళని చూసి వాళ్ళను అతి వినయంగా సాగనంపడం....
ఏంటో ఈ పలుకుబళ్ళ పరపతుల సంగతి....??...-:)


3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

ఏంటో ఈ పలుకుబళ్ళ పరపతుల సంగతి....??...-:)
డి ఎస్ పి వచ్చారనో... ఏ ఎస్ పి వచ్చారనో వాళ్లకు రాస మర్యాదలు...ముందుగా వాళ్ళని చూసి వాళ్ళను అతి వినయంగా సాగనంపడం....
కొన్ని నిజాలు అంతే మనసును కలవర పెట్టేస్తుంటాయి
చివరికి ఆ దేవుడికీ ఈ వైద్యుడికీ కూడా తప్పనట్లు, అవినీతి రంగును పులుముకోవడం ....
అభినందనలు మంజు యనమదల గారు .... విశిష్ట భావన ల తో మీ బ్లాగును తీర్చిదిద్దుతున్నందుకు

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు చాలా సంతోషంగా ఉంది మీ మెచ్చుకోలుకు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మంజు గారూ, ఈ "పరపతుల" విషయం బయట వెయిట్ చేసేవారికి చిరాకుగానే ఉంటుంది కాదనను, కాని ఈ పద్ధతులకొక కారణం ఉందనిపిస్తుంది. మీరు ఉదహరించిన పోలీస్ అధికారులే కాక, తహసీల్దార్, డెప్యూటీ కలెక్టర్ లాంటి వేరే ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కూడా అటువంటి చోట్ల అప్పుడప్పుడు కనిపిస్తారు. వీరంతా బిజీగా ఉండే బాధ్యతాయుతమైన ఆఫీసర్లు కాబట్టి వాళ్ళకి టైం తక్కువగా ఉంటుంది కాబట్టి, వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది (అంటే, మాది మాత్రం టైం కాదా అని కోప్పడకండి. అటువంటి బిజీ ప్రభుత్వ ఆఫీసర్లని క్యూలో రండి అనలేరు కదా. అది అందరికీ ఇబ్బందికరం. అనేక కారణాలు. వాళ్ళు త్వరగా వాళ్ళ విధి నిర్వహణకి తిరిగి వెళ్ళాలి. వారి పైవారు వాళ్ళని అర్జంట్ గా రమ్మని కబురు పెట్టవచ్చు. పబ్లిక్ కి సంబంధించిన ఎమర్జెన్సీ ఏదైనా రావచ్చు. అందుకని సాధ్యమైనంత త్వరగా వాళ్ళు డ్యూటీకి అందుబాటులో ఉండాలి - ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు). ఇటువంటి కారణాల వల్ల వారిని ముందు చూసి పంపించేయడం జరుగుతుంటుంది (ఇహ అటువంటి వారిని పంపించేటప్పుడు "వినయం" గా పంపించటం మాములే కదా !!). ఇది కొంత బ్రిటిష్ వారి కలోనియల్ (వలస) పాలన యొక్క మిగిలిపోయిన వాసనలు అనుకున్నా, ఈ కాలంలో కూడా పైన చెప్పిన కారణాలు మాత్రం కొట్టి పారేయవలసినవి కావు. కాకపోతే, ఈ రోజుల్లో ముఖ్యంగా దేవాలయాల దగ్గర ఈ ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా ఆర్భాటం చేస్తూ షో చేస్తున్నారు. ఇది నిజం. అయినా మా తండ్రి గారు తరచూ అంటుండేవారు - "అధికారాంతమందు చూడవలె గదా ఆ అయ్య సౌభాగ్యముల్".

(మరొక మాట. ఇటువంటి ప్రాధాన్యత పొందేది ప్రభుత్వోద్యోగులు మాత్రమే కాదు. ఉదాహరణకి, ఊళ్ళోని బడా పారిశ్రామికవేత్తలు, విద్యని కార్పొరేట్ వ్యాపారంగా మార్చి కోట్లు గడిస్తున్నవారు, సినిమా నటులు వగైరా ప్రముఖులు మాత్రం క్యూలో వేచి ఉంటారా?)

నా వ్యాఖ్య మీ టపా కన్నా పెద్దది అయినట్లుంది ఏమనుకోకండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner