అడుగడుగునా అడ్డు తగిలే ఆనవాళ్ళు
వదలకుండా వెంటపడే జ్ఞాపకపు గతాలు
మరచి పోనివ్వని మమతల గురుతులు
ఆప్యాయంగా పలకరించే ఆదరణలు
తొలకరి చినుకుల హర్షాతి వర్షంలో
చేసిన మట్టి బొమ్మల రూపాలు
ఏటి ఇసుకలో ఏరిన గవ్వల ఆల్చిప్పలు
ఓపికగా కట్టుకున్న ఇసుక గుజ్జన గూళ్ళు
ఆతల పాటల అల్లరి చేష్టల ఆ గల గలల గోదారి
ఎర్రగా పండిన గోరింటాకు చేతిని చూసుకుంటూ
ఒయ్యారంగా ఒంకిల పూలజడను తిప్పుకుంటూ
తిరిగిన ఆ బాల్యపు మధురానుభూతులను
నెమరు వేసుకుంటూ ఇప్పటి వాస్తవాల నైజాలతో
రాజి పడలేక మనసును సరిపుచ్చుకోలేక
మౌనంతో సహవాసం చేస్తూ మాటలు
మరచి పోయిన ఓ మది మధనం....!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మది ని మధిస్తే జ్ఞాపకాల దొంతరలే .. తీయని అమృతంలా .. బావుంది
మౌనంతో సహవాసం చేస్తూ మాటలు
మరచి పోయిన ఓ మది మధనం....!!chaalaa baagundi Manju gaaru:):)
నిజంగానా అండి...థాంక్యు సో మచ్ రాధిక గారు, కార్తిక్ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి