19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

నాకో చిన్న ధర్మ సందేహం కాస్త తీర్చరూ....!!

నాకో చిన్న ధర్మ సందేహం కాస్త తీర్చరూ.... నేను పురాణాలు ఇతిహాసాలు చదవలేదు... అందుకే ఈ సందేహం సీతాదేవిని రావణాసురుడు ఎలా తీసుకు వెళ్ళాడు... ??
నాకు తెలిసిన విషయం వేదవతిని రావణాసురుడు జుట్టుపట్టుకుని తీసుకు వెళ్ళబోతే అగ్నిలో ఆహుతి అవుతూ శాపం పెడుతుంది ... పరస్త్రీని ఇష్టం లేకుండా ముట్టుకుంటే దహనమై పోతాడని.. సీతాదేవిని భూమితో సహా ఎత్తుకెళ్ళాడని మాత్రమే.... దయచేసి ఈ ధర్మ సందేహాన్ని వివరంగా తీర్చండి.... కొందరు చెప్పింది .... వాల్మీకి రామాయణంలో  సీతాదేవిని జుట్టుపట్టుకుని భుజం మీద వేసుకుని రధంలో తీసుకు వెళ్ళాడని.... అసలు విషయం చెప్పి నా ఈ సందేహాన్ని తీర్చగలరు..... ధన్యవాదాలు.... !!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

voleti చెప్పారు...

అమ్మా! రావణుడు సీతను జుత్తు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళాడా.. భూమిని పెళ్ళగించి తీసుకుని వెళ్ళాడా అనే పనికి మాలిన సందేహాలు వెలిబుచ్చి కాలాన్ని వృధా పరచడము తో బాటు ఇతరులకు ఈ పవిత్ర గ్రంధాన్ని విమర్శించే అవకాశం కల్పించకుండా.. రామాయణంలో తెలియచేసిన నీతిని, ధర్మాన్ని, మనిషి ఆచరించవలసిన నియమాల్ని గ్రహించి వాటిని ఇతరులకు బోధపరచండి.. వీలైతే.. ముఖ్యంగా అద్భుతమైన గాయత్రీ మంత్ర సాధన, యోగ నిష్ట, అనేక ధర్మ సందేహాలు.. ఇవన్నీ ఎన్నో వున్నాయి... ఆంజనేయుని దండకం.. ఆంజనేయుని సాహసం.. ఇవన్నీ పిల్లలకు వుపయుక్తం.."హీమాన్, స్పైడర్ మాన్, గబ్బిలం మాన్ బదులు అరివీర పరాక్రమ వంతుడైన హనుమంతుని వీరగాధను పిల్లలకు అందిస్తే వారుకూడా ధీరోదాత్తులై వెలుగుతారు.. సుందరాకాండ పారాయణం చేసి చూడండి భక్తితో.. అరణ్య కాండని మించిన వర్ణన ఇంతవరకు ఏ కావ్యంలో కనిపించదు.. ఇవన్ని మానేసి.. రావణుడు సీత జుత్తుపట్టుకున్నాడా? చీర పట్టుకున్నాడా.. అవసరమా .. మిమ్మల్ని బాధిస్తే క్షమించండి... నా మనసులో మాట చెప్పాను.. అంతే..

అజ్ఞాత చెప్పారు...

Valmiki Ramayana:

वामेन सीताम् पद्माक्षीम् मूर्धजेषु करेण सः |
ऊर्वोः तु दक्षिणेन एव परिजग्राह पाणिना || ३-४९-१७

17. saH = he; padma akSiim siitaam = lotus, eyed, at Seetha; vaamena kareNa eva muurdhajeSu = with left, hand, thus, head-hair; dakSiNena paaNinaa uurvoH tu = with right, hand, thighs, but; parijagraaha = grabbed.

He that Ravana grabbed the lotus-eyed Seetha on lifting her up with his left hand at her plait of hair at nape, and with his right hand at her thighs. [3-49-17]

ततः ताम् परुषैः वाक्यैः अभितर्ज्य महास्वनः |
अंकेन आदाय वैदेहीम् रथम् आरोपयत् तदा || ३-४९-२०

20. tadaa = then; mahaa svanaH = one who has - strident, voice - Ravana; taam vaidehiim = her, Vaidehi; paruSaiH vaakyaiH abhitarjya = with bitter, words, intimidating; ankena aadaaya = by waist, lifting up - or dragging her onto his flank; tataH = then; ratham aaropayat = chariot, got up on.

Then he whose voice is strident that Ravana lifted her up by her waist and got Vaidehi up on the air-chariot intimidating her with bitter words. [3-49-20]

Hope you got your answer.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు అన్నది నిజమే అండి కాని ఇది కూడా నాకు తెలియని విషయం అందుకే అడిగాను చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటే తెలుసుకోవాలన్న కోరికతో అడగడం .... పిల్లలకు చెప్పేటప్పుడు కూడా అనుమానం నివృత్తి చేయాలి కదండి ... ధన్యవాదాలు చక్కని మీ సూచనకు
ధన్యవాదాలు నా సందేహం తీర్చిన అజ్ఞాత గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner