ఎలా ఉన్నావు అని ఎన్ని రోజుల తరువాత అడిగినా బావుంటుంది కదూ... చెప్పాలనుకుంటునే చెప్పలేక పోయిన ఎన్ని కబుర్లు అలానే ఉండిపోయాయో నీకు తెలుసా.... చెప్పొద్దు అనుకుంటూనే బోలెడు సంగతులు చెప్పేస్తూనే ఉంటానాయే.... అసలే వాగుడుకాయని కదా నీకు తెలిసినప్పటి నుంచి... నీకేమో మాటలే రావు... నీవి నావి కలిపి నేనే చెప్పేస్తూ ఉంటే నిన్ను నువ్వు మర్చిపోయి నన్నే చూస్తూ ఉండే నువ్వు... ఏ భావాన్ని భాషలో చెప్పక దాచేసుకుంటే.... ఎలా తెలుస్తుందోయ్.... నాకేం టెలిపతి అదేనోయ్ దూర శ్రవణం తెలియదు కధా... ముడుచుకుని మొగ్గలా సిగ్గు పడితే ఎలా చెప్పు... రావు గోపాలరావు గారు అన్నట్టు కూసింత కళా పోషణ ఉండాలి... ఎప్పుడు ఒకటే పనా నీకు... ఎన్ని రోజులు దూరంగా ఉన్నా నువ్వు దగ్గరగానే ఉంటూ మనసుని పంచుకుంటావు... అది కష్టంలోనైనా సుఖంలోనైనా... అందుకేనేమో దాన్నే చెలిమి అన్నారు.... మన చెలిమి మనకు తెలియాకుండానే మనల్ని ఎంత దగ్గరగా చేసిందో నీకు తెలుస్తోందా... పెంచుకున్న అనుబంధం ఆత్మీయంగా పలకరిస్తోంది అనుక్షణం... పరోక్షంగా వినిపించే నీ పలకరింపు నాకు వినిపిస్తూనే ఉంది... మరి నీకో.... ఏంటో ఎలా చెప్పినా మళ్ళి మొదటికే వచ్చాను.... మొత్తానికి నా చుట్టూ నీ చుట్టూ తిరుగుతూ .... ఇక్కడే ఆగిపొయాను ఎక్కడికి వెళ్లాలో తెలియక... నీకు తెలిస్తే నాకు చెప్పు... మళ్ళి ఎప్పటిలానే మౌనంగానే ఉండిపోకు......
ఉండనా మరి.... నీ నేస్తం.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి