
సభ్యులకు అందరికి మా కృతజ్ఞతలు.... 2008 లో మొదలు పెట్టిన మా చిరు చేయూత ఆర్ధిక స్తోమతలేని చదువుకునే విద్యార్దులకు మా చేతనైన ఆర్ధిక సహాయాన్ని అందించడం... ఈ ప్రక్రియలో మాతో ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు... ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా విద్యార్ధులకు డబ్బులు అందించే కార్యక్రమాన్ని మన ఉపసభాపతిగారైన శ్రీ మండలి బుద్దప్రసాద్ గారి కార్యాలయంలో వారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరమైన విషయం... మా కోసం వారు కేటాయించిన విలువైన సమయానికి.... మా అందరి కృతజ్ఞతలు ..ట్రస్ట్ వారి చేతుల మీదుగానే ప్రారంభం చేయబడి ఇప్పటికి మాతో ఆ అనుబందాన్నే కొనసాగిస్తూ చాలా సార్లు చెక్కులు వారి చేతుల మీదుగానే పంపిణి చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం... ఇప్పటి వరకు డెబ్బై మందికి పైగా సాయాన్ని అందించడం జరిగింది.... ఎవరి దగ్గరా ఏమి ఆశించకుండా మాకున్న దానిలోనే మేము అందిస్తున్న ఈ చేయుతతో చాలా మందికి విద్యా దానం చేయగలిగినందుకు మాకు ఎంతో సంతోషం.. మునుముందు మరిన్ని చేయాలని అందరి సహకారాన్ని కోరుకుంటూ.... ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి