24, సెప్టెంబర్ 2014, బుధవారం
నా బాధ్యతేం లేదు మరి....!!
నాలో మంచి ఉందో లేదో నాకు తెలియదు కాని చెడు లేదని అనుకుంటూ బతికేస్తున్నా... ఏం చేద్దాం ఎవరికి నచ్చినా నచ్చక పోయినా మనకి మనం నచ్చాలి కదా... ఎంత చెడ్డవారికైనా చెడు అంటే నచ్చదు అదేంటో మరి... వాళ్ళు మంచి కోసమే పాకులాడతారు కాకపొతే మనమే అర్ధం చేసుకోలేక పోతున్నాము... అందుకే ఎప్పుడోనే ఓ కవి అన్నారు... జరిగేవన్నీ మంచికని ఆనుకోవడమే మనిషి పని ... అని గుర్తుకొచ్చిందా ఆ పాట... నిజమే కదా... ఏమి చేయలేనప్పుడు ఇలా అనేసుకుని సరిపెట్టేసుకోవడమే... కాకపొతే ఆ సరిపెట్టుకోవడంలోనే అసలు గొడవలు వస్తున్నాయి... మనకు దానిలోనే సరిపెట్టుకోవాలా... లేక ఇంకా ఎక్కువ కావాలని ఆశ పడాలా... ఏంటో ఏది అర్ధం కాకుండా గందరగోళంగా ఉంది.... పైకి ఎదగాలి అంటే ఆశ ఉండటంలో తప్పు లేదు.... అదేమరి లేని దాని కోసం ఆశ పడటం తప్పు అని చిన్నప్పుడు చెప్పింది గుర్తుకు వస్తే ఈ ఆశ తప్పే... చూసారా వింత ఒకే ఆశ మనకు తప్పుగానూ ఒప్పుగాను అనిపిస్తోంది.... ఎంత ఎదిగినా ఒదిగినా తృప్తిని మించినది మరొకటి లేదండి... అదే ఆత్మ తృప్తి.... ఆత్మానందం... ఇది మనకు దొరికిన రోజు ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప జీవితం మనదే... ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా బతికేయగలగడం మనలో ఎంతమందికి చాతనౌతుంది చెప్పండి... ఎలా ఉన్నా... ఎక్కడ ఉన్నా సంతోషంగా బతకగలిగిన రోజున ఆ తృప్తి కోట్లకు సరితూగ గలదా.... అలానే మంచి చెడు అనేది మనం చూసే దృష్టిలో ఉంటుంది చాలా వరకు... మంచిని తీసుకుని చెడుని వదిలేస్తే పోలా ఏ గొడవా ఉండదు.... ఏదో సరదాకి రాశాను... ఎవరు నొచ్చుకోకండి.. మీరేం అనుకున్నా నా బాధ్యతేం లేదు మరి....-:) !!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి