యాంత్రికతే తప్ప భావుకత లేని బతుకుగా
మరల అతుకులే కాని మమతానురాగాలు లేకుండా
రాపిడి ఒరిపిడుల రాజ్యాలలో ఓ పావుగా మిగిలి
అహంకారానికి అతకని మమకారాన్ని మరచి
మనసు లేని మరల యంత్రాలతో సహజీవనం సాగిస్తూ
అలంకారపు చిరునవ్వుని ఆసరాగా తీసుకుని
ఆశల సౌధాలలో విహరిస్తూ జారిపడిన వాస్తవంలో
నిలదొక్కుకోలేక మోసపు వలయంలో ఇమడలేక
ఎదురుగా అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని చూస్తూ
అసమర్ధతలో సమర్ధతని వెదికే సామర్ధ్యాన్ని పొగడలేక
నిరాశావాదాన్ని దరిచేరనివ్వని ఉదయపు సాయంత్రాల
క్రీనీడలలో కనిపించే నీలి నీడల నిజాలను నమ్మని
జీవితాల చీకటి కోణాల వెలుగులు విరజిమ్మిన కాంతిని
తట్టుకునే శక్తి లేని అశక్తత తల ఎత్తుకుంది వికటాట్టహాసంతో....!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అచ్చంగా సిరి వెన్నెల సీతారామసాస్త్రి గారి సాహిత్యం లాగా ఉంది.
అచ్చంగా సిరి వెన్నెల సీతారామసాస్త్రి గారి సాహిత్యం లాగా ఉంది.
పావని గారు మరీ అంత గొప్పగా చెప్పకండి మీరు ... నాకు సంతోషం ఎక్కువై పోతుంది ... చాలా చాలా ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి