నాకు అర్ధం కాని మాటల పదాలు నీకెలా తెలుసా అని బోలెడు ఆశ్చర్యంగా ఉంది... అస్సలు మాటలే వద్దు అనుకున్నా మాటాడక తప్పని జీవితాలై పోయాయి... మరచి పోయిన బోలెడు అక్షరాలు ఇక్కడ ప్రత్యక్షమై పోతున్నాయి ఎందుకో... విలువలు తెలియని బతుకుని విలువగా చూడటానికి పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా జారి పోయింది అని మధన పడే ఒపికే లేకుండా పోయింది... ముక్కలైన మనసుకి ఎన్నిసార్లు అతుకులు వేద్దామని ప్రయత్నం చేసినా అది అతుకులు పడక విడి పోతూనే ఉంది... సర్దుకు పోవడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని చేతగానితనంలా నువ్వు అనుకుంటూ... కారుతున్న ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం చెప్పే రోజు కోసం ఎదురు చూసే సహనాన్ని కూడా చంపేసిన నీ అహం... నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి ఇవ్వాలని చూస్తుంటే ఎందుకు ఒప్పుకోలేక పోతున్నావు..?? ఎప్పుడైనా మనం ఎదుటివారికి ఇచ్చేదే మనకి తిరిగి వస్తుంది అన్న చిన్న విషయం నీకు ఎందుకు గుర్తుకి రావడం లేదు... నమ్మిన పాపానికి పడిన ఈ మానసిక రోదనకు ఇంకా ఏం శిక్ష వేయాలని నీ కోరిక... కుటుంబం అంటే తెలియని వాళ్ళకి ఈ అనుబంధాలు.. అభిమానాలు... ప్రేమల గురించి ఎంత చెప్పినా ఉపయోగం ఉండదని చాలా ఆలశ్యంగా తెలిసింది.. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది... పెళ్ళాం, పిల్లలు మన హోదా కోసం కాదు... మన కోసం అని నీకు తెలిసే సమయం ఈ జన్మకు లేదని...
మొన్నీమద్యన జరిగిన దారుణం బాగా చదువుకున్న ప్రొపెసర్ తమ మధ్యన జరిగిన గొడవలకు కన్నబిడ్డలను చంపి తను ఆత్మహత్య చేసుకున్న వార్త విన్న రోజు ఆ ప్రోపెసర్ని తప్పు పట్టాను... చస్తే వాడు చావచ్చు కదా... పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు.. ఏం హక్కు ఉంది అని... నీ పలాయన వాదాలు విని విని నాకు అనిపిస్తోంది అలా చేయడానికి ఆ తండ్రి మనసు ఎంత క్షోభ పడిందో ఇప్పుడు తెలుస్తోంది.... మనం తప్పులు చేస్తూ గొంతు ఉంది కదా అని అరిస్తే తప్పు ఒప్పు అయిపోదు కదా.... నేనుగా బతకాలి అన్న ఆశను సమాధి చేసిన నీకు... నీతో సహకరించిన సమూహానికి... మీ అందరి చేతిలో మోసపోయిన మా బతుకుల చితిని కానుకగా సమర్పించి కనీసం ఆత్మగా మిగిలి పోవాలని కోరుకోవడం కూడా ఆ దేవునికి అత్యాశగా అనిపించి మృత్యువుని దగ్గర చేసినట్టే చేసి దూరం చేస్తూ ఆడుకుంటున్నాడు నీలానే....!!
నేనుగా మిగిలి పోవాలని.....
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి