మనసుపై చేసిన దాడిలో
గాయాలదే పై చేయిగా మారింది
విజయానికి చేరువగా రాని
ఊహల వాస్తవాలు వెక్కిరిస్తూ
అల్లంత దూరంలో నిలబడ్డాయి
మారాము చేసిన జ్ఞాపకాలు
మౌనాన్ని ఆశ్రయించి దిగులుగా
ఎద వాకిట్లో తల్లడిల్లుతున్నాయి
అల్లరి సంతకాల ఆటల ఛాయలు
ఆటకలెక్కిన గతాలుగా మారి
భూతకాలానికే పరిమితమై పోయాయి
ముగ్ధంగా మురిసే ముచ్చట్లు
మాటలు మరచి మూగ నోము పట్టి
గుండె గొంతును దాటి రాలేకున్నాయి
నీవు లేని క్షణాల నిజాన్ని జీర్ణించుకోలేక
మరలి రాని కాలాన్ని వెలివేసి నిన్నల్లోనే నిలిచిపోయి
రేపటిని వద్దంటూ మిగిలిపోయిన జీవితం....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి