వేల యుగాల నిరీక్షణకు
దొరకని సమాధానాన్ని
ఎక్కడో వెదుకుతున్నా
వాడి పోయిన పువ్వుల్లో
తరగని పరిమళాన్ని
ఆస్వాదిస్తూనే ఉన్నా
స్తబ్దంగా మారిన మదిలో
నిస్సత్తువగా నిలబడిన
వాస్తవాన్ని చూస్తున్నా
చితికి పోయిన జ్ఞాపకాలలో
నీలి నీడల చిత్రాల కోసం
తరచి తరచి పరికిస్తున్నా
నువ్వు వదలి పోయిన
గత గవాక్షంలోనే ఎదురుచూస్తూ
అక్షరాలతో సహ జీవనం చేస్తున్నా
రాలిపడిన వెన్నెల కెరటంతో
మరో పున్నమిలో చెలిమి చేద్దామని
వేకువ వెన్నెల రెక్కల చాటుకు చేరా
పరుగులెత్తుతూ వెళిపోతున్న కాలంలో
నువ్వు లేని క్షణాలను నిరాకరిస్తూ
జీవితానికి అర్ధాన్ని మరచి పోతున్నా...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి