13, జులై 2015, సోమవారం

అంతర్ముఖంలో....!!

మూసుకున్న ఆ రెప్పల మాటున
ఒలుకుతున్న భావాల ఒరవడి
జారుతున్న కన్నీటికి సాక్ష్యం

మది మౌనానికి వేదికగా
రూపుదిద్దుకుంటున్న ఆక్షరాలు
చిలుకుతున్న సంకేతాలు

అంతర్యుద్దాన్ని అవలోకిస్తూ
ఋణ శేషాలను లెక్కలు వేస్తూ
బంధాల బాధ్యతల అంతర్నేత్రాలు

వెలుగులు వేసారి పోతూ
చీకటి సామ్రాజ్యానికి పట్టం కడితే
కొడిగడుతున్న దీపపు అవశేషాలు

అంతర్ముఖంలో ఆలోచిస్తూ
జీవన్మరణ యుద్దానికి సన్నద్దమైన
కాయపు అంతిమ ఘడియలు

అస్పష్టమైన ఆకృతుల
ఆనవాళ్ళలో చేరుతూ జన్మరాహిత్యంలో
ప్రేమ సాన్నిహిత్యానికై పరుగులు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner