మనసు భావాలకు రూపాన్ని చెక్కే
శిల్పి చేతిలో ఉలి తానైనందుకు
కలం సిరా నుండి ఒలికిన
ప్రతి గేయము గాయమై తాకుతుంటే
ప్రతి క్షణము ప్రసవ వేదనే
రెప్పల చాటున దాగిన
కన్నీటి చెలమల సాక్షిగా ఒప్పుకున్న నిజాలు
గునపాలై గుండెలను చీల్చుతుంటే
వెలుతురు చూడలేని
చీకటి జ్ఞాపకాలు చుట్టాలై చేరితే
తల్లడిల్లే మదిని సముదాయించలేక
అమ్మ భాష తెలిసిన
అక్షరాన్ని ఆశ్రయం కోరితే
స్వాంతన అందిస్తూ కడుపులో దాచుకుంది అమ్మలా....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి