26, జులై 2015, ఆదివారం

ఏక్ తారలు....!!

1. అనుబంధము ఆత్మీయంగా పలుకరిస్తుంది_అసహనం సహనంగా మారితే
2. వసంతం సంతసమైంది_నీ రాక తెలిసి
3. సమీరం చల్లగా తాకింది_వసంతలో మనం సంతసమని
4. వేసవిలో వసంతం వచ్చింది_నీతో చెలిమి చేసాక
5. నీటి మీది రాతలు నవ్వుతున్నాయి_నీ మీద నాకున్న నమ్మకాన్ని చూసి
6. అలసిన పొద్దు వాలుతోంది_వెన్నెల్లో చుక్కలకు నీ మేని మెరుపులద్దుతూ
7. చీకటి చిరునామా చెరిగి పోయింది_వేకువ పొద్దులో నీ చిత్రాన్ని చూస్తూ
8. రాయబారానికెళ్తున్నా_తులాభారం కట్నమడుగుతారేమో
9. నవ్వుల్లో రాలుతున్నాయి_మనసు మౌనాల ముత్యాలు
10.  పరిమళాన్ని ఆస్వాదించే మనసుకు_మల్లెల పారిజాతాలే ఎటు వెళ్ళినా
11. అవరోధాలను తొలగిస్తూ ఆత్మీయ బంధం_అడ్డంకిని అధిగమిస్తుంది
12. ఎలా చిత్రించినా_మనసు చూపించేది నీ రూపాన్నే
13. నమ్మకమే పునాదిగా మారింది_కన్నీళ్ళను ఘనీభవింపజేస్తూ
14. మెరుపు వెలుగులో మైమరచా_చిక్కుకున్న బంధాన్ని విప్పలేక
15. వెన్నెల నవ్వుకు_కోపంతో ఎరుపెక్కిన సూరీడు
16. వసంతపు చెలిమికి_కన్నెర్ర చేసిన గ్రీష్ముడు
17. ఒంటరితనమేలా_ వేల తారల చెలిమి నీ తోడుండగా
18. తలపుల్లో కావేరిలా_ప్రతి క్షణమూ నీ వెన్నంటే
19. వింటున్నా_మౌనంలో నీ పలుకుల రాగాన్ని

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner