24, ఏప్రిల్ 2020, శుక్రవారం
ఓ మాటినండి..!!
అయినదానికి కానిదానికి మనోభావాలు దెబ్బదినడం అన్న మాట బాగా వాడేసి పొద్దు పొద్దున్నే చరిత్రకెక్కేద్దాం అనుకుంటే చరిత్ర సంగతి దేవుడెరుగు మనం గల్లంతైపోడం ఖాయమబ్బా... జ్వరం వచ్చింది అంటాం..కాని జ్వరం వచ్చాడు అనం కదా...భాష, భవిత, భావం వగైరా చూడాలి కాని స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసక లింగమా అంటూ చూస్తే...?
మతాలను అవహేళన చేసినప్పుడు, హత్యా రాజకీయాలు జరిగినప్పుడు, సామాజిక అన్యాయాలు జరిగినప్పుడు మాత్రం మనం స్పందించం...జంతువులను కూడా వచ్చింది, పోయింది అనే కదా వ్యవహరిస్తాం..అలా అని స్త్రీని జంతువుతో పోల్చినట్టా..! పనికిమాలిన రాజకీయాలు మాని పనికివచ్చే పని సూడండి అమ్మలు, అయ్యలు...ఓ తెగ సించేసుకుంటున్నారు..!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
హ్హ హ్హ హ్హ హ్హ, “మనోభావాలు” పదాన్ని ఈ మధ్య కాలంలో తెగ వాడేసుకుంటున్నారు .... రాజకీయం చెయ్యడానికి.
అసలు మీ ఈ పోస్టుకు ప్రేరేపణ ఏమిటి మంజు గారూ? వార్తల్లో ఈ అంశాన్ని నేను మిస్ అయినట్లున్నాను.
కరోనాని రక్కసి అన్నారట..దానికి స్త్రీలని అవమానించారని ఓ గింజుకుంటున్నారు.. అదండి సంగతి...
పనికిమాలిన వెదవలు మైండ్ లేని కామెంట్లు పెడితే మీ బుద్దిని బయటేసుకుంటున్నారని జాలి పడతా.. ఎందుకురా నాకు పడి ఏడుస్తారు...మీ మనోభావాలు తగలెయ్యా
బాగుందండి, బాగుంది. మరీ అతి అయిపోయింది. ఫ్రీ పబ్లిసిటీ దురద.
నేనేదో హాస్యానికి రాస్తే మీరు గాని ఫీలయ్యారా ఏమిటి?!
అది హాస్యం కాదండి.. అపహాస్యము..ధన్యవాదాలు
అవునండి..
"కరోనా" context లో ఈ క్రింది కామెంట్ కూడా చూడండి, మంజు గారు (మీరు ఆల్రెడీ చూశారేమో మరి?) 🙁.
---------------
"प्रवीण April 28, 2020 at 4:59:00 AM GMT+5:30
ఫేస్‌బుక్‌లో కొత్త రకం వితండవాదం ఉంది. "మారెమ్మ అనేది దళిత దేవత అట, మహమ్మారి అనే పదం దళితుల్నీ & స్త్రీలనీ కించపరిచే విధంగా ఉందట!". ............"
-----------------
పూర్తి వ్యాఖ్య ఈ క్రింది లింక్ లో 👇.
మనోభావాల గురించి "పల్లెప్రపంచం" బ్లాగులో ఒక వ్యాఖ్య
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి