29, మే 2020, శుక్రవారం
మన చరిత్ర...!!
నీలం సంజీవరెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని తెలియగానే రాజీనామా చేసిన ఘన చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ది ఒకప్పుడు.
మరి మన ఇప్పటి చరితేమిటయా అంటే ముద్దాయిలు పాలించే పరిస్థితి. కోర్టులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చినా తమని కాదని దులిపేసుకునే రకాలని అర్థం అయ్యిందా ఇప్పటికయినా.
మరిలా ఎంత కాలమెా... ప్రభుత్వం మీద వ్యతిరేకంగా 60 పైబడి కేసులు, వ్యతిరేక తీర్పులు...తన తీరు మార్పు రాని, మార్చుకోని ప్రభుత్వం ..మరి కోర్టు తీర్పుల ఫలితం ఏమిటి...?
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నీలం సంజీవ రెడ్డి కేసు వివరాలు:
సంజీవరెడ్డి మొదటి దఫా తరువాత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. దామోదరం హయాములో ప్రైవేట్ బస్ రూట్ల జాతీయకరణ ఏ క్రమంలో జరగాలన్న పాలసీ నిపుణుల కమిటీ ద్వారా నిర్ధారించారు.
కర్నూల్ జిల్లాలో నీలం వ్యతిరేక వర్గ ముఖ్యులు దామోదరం & పిడతల రంగారెడ్డి. పశ్చిమ కర్నూల్ జిల్లా ప్రైవేట్ బస్ యజమానులు పిడతల అనుచరులు. 1962 ఎన్నికలలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష హోదాలో ఉన్న నీలం తన వ్యతిరేక ముఠాకు చెందిన దామోదరం & పిడతల సమర్థకులకు టికెట్లు రాకుండా లాబీయింగ్ చేసాడు. బస్ ఓనర్లు నీలం ముఠాకు వ్యతిరేకంగా పని చేయడం మూలాన కర్నూల్ వ్యాప్తంగా అతని వర్గస్థులు (సంజీవ రెడ్డి అల్లుడు చల్లా రామభూపాల్ & కోట్ల విజయ భాస్కర్ రెడ్డితో సహా) ఓడిపోయారు. (పిడతల కూడా ఓడిపోయాడు, వేరే విషయం).
దామోదరం సౌమ్యుడు కనుక అధిష్టానాన్ని మెప్పించలేకపోయాడు. ముఖ్యమంత్రి పదవి కోసం నీలం-కాసు బ్రహ్మానంద రెడ్డి పోటీలో కామరాజ్ మద్దతుతో సంజీవ రెడ్డి తిరిగి సీఎం సీటు ఎక్కాడు. గద్దె ఎక్కిన కాస్సేపటికి మునుపు నిర్ధారించిన క్రమానికి విరుద్ధంగా నెల్లూరు & చిత్తూరుకు బదులు కర్నూల్ బస్ రూట్లను, అందునా పిడతల ముఠా మద్దతుదారులకు ప్రభావం ఉన్న పడమరన మాత్రమే, జాతీయం చేయాలనీ ఆర్టీసీని ఆదేశించాడు.
వైరిపక్షం హైకోర్టు వెళ్ళితే తీర్పు ఆర్టీసీ తరఫున వచ్చింది. సుప్రీం కోర్టు అప్పీలులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం రావడమే కాకుండా, 5 సభ్య బెంచీ సంజీవ రెడ్డి చర్యలను తీవ్ర పదజాలంతో ఖండన చేసింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి