22, జూన్ 2020, సోమవారం
ఏక్ తారలు
1. మన మధ్యన పోలికెందుకు_అన్నీ సమం చేసే అక్షరాల అనుబంధం మనదైతే..!!
2. చుక్కలన్ని లెక్కెడుతున్నా_మౌనానికి ముగింపు చెప్పడానికి...!!
3. వాకిట్లో వెన్నెలని_గుండె గూటికి వెలుతురునౌతానంటూ.!!
4. గాయమే గేయమైంది_దిగులుపడ్డ మనసుని ఊరడించడానికి..!!
5. అక్షరమంతే భలే మాయ చేస్తుంది_అన్నీ తనలో ఇముడ్చుకుంటూ...!!
6. శరము వంటిది అక్షరం_విలుకాడి పనితనంపై ఆధారపడి ఉంటుందంతే...!!
7. పడి లేచే పోరాటం కెరటానిది_గెలవాలన్న అరాటంతో... !!
8. గొంతు మూగబోయింది_మనసు మౌనాన్ని విప్పి చెప్పలేక...!!
9. పుట్టుకతోనే మూగది మనసు_భావాలను స్వరపరచలేని శాపంతో..!!
10. అక్షరాలకు వడుపు తెలిసింది_పదాలను ఏర్చి కూర్చడంలో...!!
11. ఓ మాట చెప్పలేదనుకున్నా_మనసు తెలిసిన మౌనానికి...!!
12. సర్దుకుపోదామనే అనుకున్నా_రహస్యాన్ని రహస్యంగా ఉంచేసావని...!!
13. మాటెందుకు? మనసుని వినరాదూ_కారణాలేవైనా కానీ...!!
14. గుట్టు నీకు చెప్పింది_గుంభనంగా వుంటావనే కదా...!!
15. నమ్మాను కనుకే చెప్పాను_మనసు బాంధవ్యం మనదని..!!
16. గుండెలో దాచుకున్నాను_గుర్తెరిగి నీవు వస్తావని...!!
17. ఊరడింపులకు అనువైన దారే అది_అక్షరాలకే కుదురు లేదు..!!
18. నడత తెలిసిన అక్షరాలవి_హద్దు మీరని హొయలొలకబోస్తూ..!!
19. అక్షరాల బంధమిది_అక్షరాలా మరువనివ్వనంటూ...!!
20. మనసు భాష మనది_అక్షరాల స్నేహంలో సేదదీరుతూ...!!
21. చదివేయడం పరిపాటైపోయింది_మనసు నీదయినా నాదయినా..!!
22. అంతర్జాల నెయ్యమిది_అక్షరాల అనుసంధానంలో మెలుగుతూ..!!
23. అట్టిపెట్టుకున్నానందుకే_మనసుని సర్దే చతురత తెలియక...!!
24. నేను అపరిచితమే ఎప్పుడూ_జ్ఞాపకాల ఛాయ లేని మనసు నీదయినప్పుడు..!!
25. గతజన్మ జ్ఞాపకమే_కలలా మెదులుతూ మదిలో కొలువై...!!
26. మనసు మరో మాట లేదంది_మౌనమే అలంకారమంటూ...!!
27. ఆభరణం అలంకారం మాత్రమే_మనసనే అద్భుతానికి..!!
28. చెమ్మగిల్లిన కనులకు తెలుసు_ గాయపడిన గుండె బరువెంతో..!!
29. తడిచిన చెక్కిలికి తెలుసు_జారిన కన్నీటి విలువ...!!
30. వెచ్చదనం గాయానిది కాదు_గుండె మంట కన్నీటికి చేరిందంతే...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి