11, జూన్ 2020, గురువారం
అందరూ అపర గానకోకిలలే...!!
కష్టంలో ఉన్నోడికి ఓ పూట ముద్ద పెట్టలేరు(ముద్దెటగలరు) కాని... నాలుగు ముక్కలు రాయడమెుచ్చిన పతోరూ... సరదాగా ఓ రాగం తీస్తే ఈ అపర గానగంధర్వులందరూ ఓ గోలెట్టేత్తున్నారే...
రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ యన్ టి ఆర్ హీరో భార్యకి ఫ్రీ గా ట్రీట్మెంట్ చేయించిన మంచి మనసు బాలయ్యది. తన కన్నా ఎదిగిపోతారేమెానన్న అసూయతో ఎవరి మీదా బ్లూ ఫిలిం కేసులు బనాయించలేదు. అన్యాయంగా ఓ యువ హీరో మరణానికి కారకుడు కాలేదు. ప్రజాసంక్షేమానికి, ధన రాజకీయాలకు, పార్టీ పెట్టి పదవి కోసం, అవార్డుల కోసం నాటకాలాడటం, రాక్షసనీతికి తేడా తెలిసినోడు. కుటుంబ విలువలు, పిల్లల పెంపకం, బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం మాత్రమే తెలిసినోడు... తెలుగు భాషకు చరమగీతం పాడాలన్న దరిద్రపు ఆలోచనలు లేనోడు. ఓరి నిరారక్షిత అక్షుపక్షుల్లారా.. రాజిక సౌద్దానం అంటూ సగం తెలుగు, సగం ఇంగ్లీష్ మాట్లాడే మీకన్నా, కనీసం ఎమ్ ఎల్ ఏ గా ప్రమాణ స్వీకారం చేయలేని మీకన్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్నే పరిహసించే మీకన్నా తన సంపాదనతో బతుకుతూ, నలుగురికి సాయపడే బాలయ్య పాట మీకంత నవ్వులాటైందా?
ముఖపుస్తకం గానకోకిలలందరూ మీ స్వరాలు, రాగాలు కాస్త చూసుకోండమ్మా... రేపు ఇండియన్ నైటింగేల్ అవార్డ్ మీకే...ఓ చదువుకోని ఏలిముద్రలున్నాయి కదా... అదేనండి భారత కోకిల పురస్కారం మీకే మరి....
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి