ఎదలోని వెతలు వెలికి రాకుంటే...
సడి లేని గుండె గూటిలో.... నీ గురుతు గా...
చిరు మువ్వల సవ్వడి ఎక్కడి నుంచో....!!
అక్కడా..ఇక్కడా...ఎక్కడా... అని వెదుకులాటలో....
విసిగి వేసారి పోతుంటే...!!
అందెల సడి అలవోకగా వినిపిస్తూనే వుంది...!!
నువ్వు నా చేరువలోనే ఉన్నావని తలపిస్తూ...!!
అయినా కానరాని నీ జాడ కోసం....
జగమంతా జల్లెడ పడుతుంటే...!!
దోబూచులాడుతూ....
దగ్గరే వుంటూ....దూరంగా ఉంటావెందుకు..??
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
అయినా కానరాని నీ జాడ కోసం....
జగమంతా జల్లెడ పడుతుంటే...!!
దోబూచులాడుతూ....
దగ్గరే వుంటూ....దూరంగా ఉంటావెందుకు..??...
chala baagundi maju gaaroo!...@sri
చాలా సంతోషం శ్రీ గారు నచ్చినందుకు
thank u ramesh garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి