ఏ కడలిలో కలవనుందో...!!
ఏ తీరాన్ని చేరనుందో...!!
రాత రాసిన బ్రహ్మకెరుక...!!
చేరాలనుకున్న గమ్యం చేరువలో లేదు
చేరిన తీరం నన్ను కాదంటోంది....!!
మళ్ళి మొదటికే వచ్చింది...నా పయనం...!!
ఏమిటో ఈ అర్ధం కాని అయోమయం...!!
ఎండమావులు ఒయాసిస్సులని పరుగెత్తి
అలసిపోయిన బతుకు బండి...
ఆశ నిరాశల్లో కొట్టుకుంటూ....
దూరంగా కనిపించి మురిపిస్తూ...
ఆశ పెడుతున్న....
ఒయాసిస్సుల కోసం మళ్ళి
పరుగు మొదలు....!!
అదేనేమో....రాబోయే క్షణం కోసం...ఆశా జీవితం....!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
excellent
excellent
excellent
Thank u Anu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి