ఆగని కాలంతోసాగే అంతం లేని పయనం
భానుని తొలి పొద్దు మలి పొద్దు మద్యలో
జరిగే జీవిత చిత్రాలు విచిత్ర విధి రాతలు
నిరంతరం సాగే అంతర్మధన చెలగాటం
అర్ధంలేని ఆవేశాల విపరీత పరిణామం
రెప్పపాటు ఈ జీవితంలో లెక్కకు రాని
రెప్ప మూయలేని క్షణాలు అనునిత్యం
చాటు మాటు సంగతుల సమాహారాలు
బంధాల అనుబంధాల అవసరపు లెక్కలు
మరచిన బాధ్యతల నడుమ కూరుకుపోయిన
హక్కుల కోసం ఆరాటం చేసే ఆర్భాటం
మనిషి గమనాన్ని నిర్దేశించే మనసు
చంచల చపలత్వంలో కొట్టుకు పోతూ
ఎండమావుల తీరాల వెంబడి పరుగిడుతూ
కాలుతున్న గాయాలకు ఒయాసిస్సుల అండ కోసం...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"ఉరుకుల పరుగుల అనంత పయనం .... నిరంతర అంతర్మధన ఆవేశాల విపరీత పరిణామం .... రెప్పపాటు జీవితంలో రెప్ప మూయలేని క్షణాలే అన్నీ .... మనిషి గమనాన్ని నిర్దేశించే మనసు ఎండమావుల తీరాల వెంబడి కొట్టుకు పోతూ ...."
"కాలుతున్న గాయాలకు" .... నగరం లో నివసిస్తున్న ప్రతి జీవీ జీవిత చిత్రణ లా ఉంది ఈ కవిత. నన్ను నేను చూసుకున్న ప్రతి సారీ నాలో చెలరేగే భావనల అక్షరాల పద రూపం లా ఉంది. చక్కగా అద్దంలో చూసుకుంటున్నట్లు ఉంది.
శుభాభినందనలు మంజు యనమదల గారు!
మనఃపూర్వక వందనాలు మీ అభిమాన స్పందనకు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి