నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతి విజయం వెనుక ఓ పట్టుదల, ఓ కసి, ఓ ఆవేశం, ఓ రోషం .... ఉంటుందని...!! మనం అనుకోగానే అందేది కాదు కదా విజయం అంటే...!! అలా దొరికితే అది విజయం అనిపించుకోదేమో... ప్రతి గెలుపు వెనుక ఎంతో మానసిక ఒత్తిడి, ఎన్నిటినో కోల్పోయిన జీవితం, మరెన్నిటికో మనసుకు సర్ది చెప్పుకున్న క్షణాలు, ఓటమి అంచున నేర్చుకున్న పాఠాలు...ఇలా అన్ని కలిపితే ఓ గెలుపు...నా దృష్టిలో...!!
అంతా సవ్యంగా సాగితే అందరు సాధు జీవులే...అంతా తమ మహిమే అని పొంగిపోతూ తలలు ఆకాశానికి ( రొమ్ములు విరుచుకుని వస్తాదుల్లా ప్రవర్తిస్తారు ) అంటించుకుంటారు ... అన్ని సరిగా ఉంటే ఎవరైనా మరొకరికి నీతులు చెప్తూ తమ మంచితనాన్ని చాటుకుంటారు...అదే కాస్త చిన్న కష్టం వచ్చినా అమ్మో... ఈ కస్టాలు పగ వాళ్లకి కూడా రాకూడదు...నేను కాబట్టి ఇంత కష్టాన్ని భరించ గలుగుతున్నా అని కొందరు...ఇంత పెద్ద కష్టం ఎవరికీ రాదు నాకే ఎందుకిలా...అని మరికొందరు...ఇలా విభిన్న ఆలోచనలతో ఉంటారు...చీకటి వెలుగు మన దైనందిన జీవితంలో ఉన్నట్టే కష్టం సుఖం కూడా మన వెన్నంటే ఉంటాయి.....ఇక్కడ నాకు మా హింది టీచర్ రత్నకుమారి గారు చెప్పిన ఓ మాట కష్టం లో ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను...." చెడు జరిగింది అని బాధ పడతాము..కానీ ఆ చెడు వెనుక కూడా మనకు ఓ మంచి ఉంటుంది,,," అని..నిజంగా ఇది నిజమండి..!! అలానే మా పిన్ని చెప్పిన ఇంకోమాట కూడా...." మనకు కష్టం తప్పనప్పుడు దేవుడు దాన్ని మనం తట్టుకోగలిగినప్పుడే పెడతాడు " .. అని..ఇది నిజమే అనిపిస్తుంది నాకు...!! ఇంకో చక్కని మాట యండమూరి గారు చెప్పింది సమస్య జీవిత కాలం మన జీవిత కాలంతో పోల్చుకుంటే చాలా చిన్నది....అవును కదండీ ఒకే సమస్య మన జీవితమంతా వేధించదు కదా...బోలెడు సమస్యలు వస్తు పోతూ ఉంటాయి....అందుకే ప్రతి సమస్యకు క్రుంగి పోకుండా కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరకక పోదు...అందుకని విలువైన జీవితాన్ని సాధ్యమైనంత వరకు ఝటిలం చేసుకోకుండా ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తే చాలు...మన పుట్టుకకు ఓ అర్ధాన్ని చేకూర్చ గలిగితే అదే జీవిత పరమార్ధం అవుతుంది...అంతే కాని ప్రతి చిన్న కష్టానికి నిరాశతో జీవితాన్ని ముగించే ఆలోచన మన దరి చేరనివ్వకూడదు...!! మనం అనుకున్నది జరిగితేనే మనం గెలిచినట్లు కాదు...మన వ్యక్తిత్వంతో, మన ప్రవర్తనతో నలుగురి మనసులు గెలుచుకుంటే చాలు....అది ఓ గొప్ప గెలుపే...!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మంచి మాట చెప్పారు.కష్టాలు కలకాలం ఉండవు అని.
ఈ కస్టాలు పగ వాళ్లకి కూడా రాకూడదు. నేను కాబట్టి ఇంత కష్టాన్ని భరించ గలుగుతున్నా అని కొందరు, ........ ఇంత పెద్ద కష్టం ఎవరికీ రాదు నాకే ఎందుకిలా? అని మరికొందరు,
చీకటి వెలుగులు దైనందిన జీవితంలో ఉన్నట్టే కష్టం సుఖం కూడా ఒకదాన్నొకటి వెన్నంటే ఉంటాయని మరిచిపోయి ....
నిజం! భరించగలిగి పోరాట స్పూర్తి ఉన్నవారికే కష్టాలొస్తాయనుకుని పోరాడితే జీవితం లో నిరుత్సాహం పదానికి అర్ధం ఉండదు.
మంచి మంచి సామాజిక ఉపయోగకర విషయాలపై మీ పోస్టింగ్స్ చాలా బావుంటున్నాయి. అభినందనలు మంజు గారు!
మనఃపూర్వక వందనాలు చంద్ర గారు మీ స్పందనకు
ధన్యవాదాలు అజ్ఞాత గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి