నీ మాటల మంత్రాల మౌన తరంగాలలో
హోయలొలికే వంపు సొంపుల నయగారాలలో
నీ నడకల నాట్య విన్యాసాలే ప్రతి కదలికలో
పరుగుల ఉరకల ఎత్తు పల్లాల హడావిడిలో
అలుపు సొలుపు లేని ఆత్మ విశ్వాసంలో
వేవేల వర్ణాల వడ్డింపుల కూర్పులలో
అలా అలా సాగే అందమైన పయనంలో
హాలహలాల కాలకూట అంతర్మధనంలో
అందిన అమృత భాండం సాగర మధనంలో
చేజారిన జీవితాన్ని చూసుకుంటూ
ఆంతర్యంలో అంతరాన్ని అర్ధం చేసుకునే క్రమంలో
అలసిన ఓ జీవితం..!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"అందమైన పయనంలో హాలహలాల కాలకూట అంతర్మధనంలో అందిన అమృత భాండం .... అంటూ" అనుభవాల అనుభూతుల భావనల అద్భుతవర్ణన
అభినందనలు మంజు గారు!
మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు
అందమైన జీవితాలన్నీ ఆప్యాతలకై వేసారి, విసిగి, వేదనామయం అవుతున్నాయి.
అధ్బుతమైన భావం,
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి