ఊహల్లో రూపాలు కన్నుల్లో దీపాలు
మనస్సుల్లో మౌనాలు మాటల్లో మొహాలు
రేయంతా రాగాలు చుక్కల్తో అచ్చట్లు
చూపుల్తో ముచ్చట్లు చేతుల్తో చప్పట్లు
కోపాల తాపాలు మమతానుబంధాలు
విడలేని పాశాలు చుట్టేసిన చుట్టరికాలు
కలబోసిన కలల కవ్వింతల వాకిళ్ళు
వరుసలు కలిపిన సరసపు సైయ్యాటలు
పక్కున నవ్విన పంచదార చిలకలు
పసిడి కాంతుల పండు వెన్నెలలు
మెత్తని తీరపు అలల ఇసుక తిన్నెలు
పచ్చని పట్టుపరుపుల పైరుల పలకరింపులు
మత్తెక్కించే గుభాళింపుల గంధాల మైమరపులు
ఆరుబయట అందాల రంగవల్లుల అల్లికలు
ఛిరునవ్వుల తోరణాల చినుకుల అలంకారాలు
అన్ని కలిపి కనిపించిన అచ్చ తెనుగు లోగిళ్ళు
అపరంజి కావ్యాలు మా పల్లెల మనసుల వాకిళ్ళు..!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
పసిడి కాంతుల పండు వెన్నెలల .... అలల ఇసుక తిన్నెలు .... ఎన్నో కల కలిపిన అచ్చ తెనుగు లోగిళ్ళు .... ఈ అపరంజి కావ్యాల మన "పల్లె మనసు వాకిళ్ళు..!!"
రంగు రంగుల రంగవల్లులు అక్షరాల్లో పొదిగి .... కళ్ళముందు, దృశ్యాలను పరిచినట్లు ఉంది.
ఇంద్రప్రస్తానం లా .... కవిత
మంజు గారికి అభినందనలు.
చాలా సంతోషంగా ఉంది చంద్ర గారు మీ అభిమాన స్పందనకు వందనాలు
చాలా బాగుంది సార్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి