25, నవంబర్ 2013, సోమవారం

ఇష్టమైన ఇష్టం...!!

ప్రేమ ఒక యోగమో...!! భోగమో..!! నాకు తెలియదు కాని ఇష్టం మాత్రమే తెలిసిన మనసుకు ఇష్టపడటం ఒక్కటే తెలుసు...!! ఇష్టం ఇష్టమైనన్ని రకాలు .... ఇష్టాన్ని ఇష్టంగా ఇష్టపడి చూస్తే ఆ ఇష్టంలో అన్ని ప్రేమలు, ఇష్టాలు ఉంటాయి...!! ముందు మనని మనం ఇష్టపడగలిగితే తరువాత ఆ ఇష్టాన్ని అందరికి పంచగలుగుతాము.. పెంచుకోగలుగుతాము...!! నిన్ను నువ్వే ఇష్టపడలేనప్పుడు మరొకరిని ఎలా ఇష్టపడగలవు..?? ముందు మనలోని మనని మనం ఇష్టపడాలి...అప్పుడే అ ఇష్టం లోని ఇష్టం తెలుస్తుంది...!! నాకు నేను ఇష్టం అయినప్పుడు నాలోని లోపాలతో సహా నేను నాకు ఇష్టం అనే కదా...!!  మరి అలాంటప్పుడు ఎదుటివారిని కూడా అలానే ఇష్టపడాలి...ఒకరిని ఇష్టపడినప్పుడు వారిలోని తప్పొప్పులను రెంటిని ఇష్టపడినట్లే....అంతే కాని మనకు నచ్చని వాటిని వదిలేసినట్లు కాదు...!! లోపాలు, కోపాలు, అలకలు, ఆనందాలు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు....ఇలా అన్ని కలిస్తేనే జీవితం సంపూర్ణం...లేకపొతే సగం చదివిన పుస్తకంలా అసంపూర్ణంగా ఉంటుంది...!! ఎవరికీ అక్కరలేని పుస్తకంలా ఓ మూలన పడి ఉంటుంది...!! మనతో మనం నిజాయితీగా ఉంటే అదే మనని అందరికి దగ్గర చేస్తుంది....నటిస్తే నాలుగు రోజులు తప్పుకోగలం... జీవితమంతా నటిస్తూ తప్పుకు తిరగలేము కదా...!! వాస్తవాలను వాస్తవంగా స్వీకరిస్తూ వాస్తవంలో బతకగలగాలి...!! తప్పులు అందరు చేస్తారు..కాని ఆ తప్పుని ఒప్పుకోగలిగే ధైర్యం మనలో ఎందరికుంది..?? ఇది తెలుసుకుంటే చాలు జీవితం సప్త వర్ణాల సాగర గీతమే అవుతుంది ప్రతి ఒక్కరికి...!!  

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

gsreecharan చెప్పారు...

really nice blogpost / blog manju garu..

vemulachandra చెప్పారు...

నిన్ను నువ్వే ఇష్టపడలేనప్పుడు మరొకరిని ఎలా ఇష్టపడగలవు..?
లోపాలు, కోపాలు, అలకలు, ఆనందాలు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు....ఇలా అన్ని కలిస్తేనే జీవితం సంపూర్ణం...లేకపొతే సగం చదివిన పుస్తకంలా అసంపూర్ణం
మనతో మనం నిజాయితీగా ఉంటే అదే మనని అందరికి దగ్గర చేస్తుంది....నటిస్తే నాలుగు రోజులు తప్పుకోగలం... జీవితమంతా నటిస్తూ తప్పుకు తిరగలేము.
తప్పులు అందరు చేస్తారు..కాని ఆ తప్పుని వొప్పుకోగలిగే ధైర్యం మనలో ఎందరికుంది..?

అవును మనసులో స్వచ్చత అవసరం .... మనిషిగా బ్రతకడానికి. అహం స్వార్ధమే మనిషిని బలహీనుడ్ని చేసేది.
మనుషులు ఆలోచనా సరళి మీద మీరు రాస్తున్న పోస్టింగ్స్ చాలా బావున్నాయి. సామాజిక పోస్టింగ్స్ ను మరిన్ని మీనుంచి ఆశిస్తూ .... అభినందనలు మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

చక్కని మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u so much Sreedharan garu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner