19, నవంబర్ 2013, మంగళవారం

ఎలా చెప్పి నమ్మించను...!!

నీకు నాకు మధ్య సాక్ష్యాలను ఎలా పిలువను....!!

అప్పుడెప్పుడో ఓ రాక వదలి వెళ్ళింది
అది నీ గురుతుగా నాకు చేరువగా
దాచుకున్నా....దాన్నెలా చూపించను...!!

సుక్కల్లే తోచి ఎన్నెల్లే కాచి
ఏడ దాగున్నావే...ఇన్ని ఏల సుక్కల్లో
యాడ నిన్ను ఎతికేది....ఎదలోని నిన్ను...!!

నన్ను నేను ఎప్పుడో పోగొట్టుకున్నా
అది తెలియక వెదుకుతూనే ఉన్నా ఇప్పటికి
నీ దగ్గరే ఉండిపోయానని తెలిపే సాక్ష్యం నా దగ్గర లేక...!!

ఏతమేసి తోడినా ఎండని ఏరు
పొగిలి పొగిలి ఏడ్చినా నిండని పొంత
ఎండిన నా మనసు... చెమ్మ లేని జీవాన్ని మిగిల్చిన కళ్ళు....!!

ఇవి చాలవా నీకు....ఇప్పటికైనా నమ్మవా...
నా జ్ఞాపకాలన్నీ నీతోనే ఉండిపోయాయని..నను వీడి వెళిపోయాయని
నీకు తెలిసిన ఈ అక్షరాలు నమ్మించడం లేదా...!!

సాక్ష్యాలుగా చూడటానికి..సమాధానాలుగా సరి పోవా...!! 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

సుక్కల్లే తోచి ఎన్నెల్లే కాచి ఏడ దాగున్నావే...
ఇన్ని ఏల సుక్కల్లో యాడ నిన్ను ఎతికేది....

ఎదలో దాగున్న నిన్ను ఎలపల యెతికి యెతికి సొమ్మసిల్లి నానని ఎలా చెప్పి నమ్మించను...?
అంటూ
అరమరికలు లేని మనసు అమాయకత్వం సిరాలో ముంచి రాసిన మనోభావనలా చాలా బావుంది. అభినందనలు.

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆత్మీయ స్పందనకు కృతజ్ఞతలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner