పెళ్ళితో జీవితం మారిపోతుంది అని పెద్దలు అటు ఏడూ తరాలు ఇటు ఏడూ తరాలు చూసి చేసే వారంట ఒకప్పుడు..కనీసం ఇప్పుడు ఆ కుటుంబం గురించి కాస్త తెలుసుకుని చేసుకుంటే కొంతయినా రాతలు బావుంటాయేమో...అనిపిస్తుంది...పెరిగిన వాతావరణం, పరిస్థితులు, చుట్టూ ఉన్న స్నేహాలు...ఇలా అన్ని అల్లోచించాలి కాస్తయినా...చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా...చాలా మందికి చేతుల కాలకుండా ఉండటానికే ఈ ప్రయత్నం...!!
పెళ్ళి ముందు రోజు నుంచే ఎందుకో కాస్త భయం మొదలు అది అలా పెరుగుతూనే వచ్చింది ఇప్పటికి..అందరిలా అన్ని ఆలోచనలు ఉండి అందరిలానే ఉంటే నా జీవితం కూడా బావుండేదేమో...!! అసలు కోరికలు లేక పోవడం కూడా ఒక తప్పేనేమో...నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోని జీవితం ఇలానే ఉంటుందేమో...!! ఏ రోజు ఇది కావాలి అని అడగని, వాళ్ళింట్లో అది ఉంది మనకి లేదు...ఇలా ఏం అడగకుండా ప్రతి నెత్తుటి బొట్టు నీకు, నీ వాళ్ళకు ధార పోస్తే ఇన్నేళ్ళ ఈ జీవితానికి నువ్వు మిగిల్చింది...కన్నీళ్ళు కస్టాలు...పదిమందికి చెప్పే నీతులు మన జీవితానికి సరిపోవు...ముసుగు తీస్తే నువ్వేంటో అందరికి తెలుస్తుంది...నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు ఇన్నేళ్ళలో ఒక్కటి మాకోసం చేసానని..!! ఏ బంధమూ నీకు అక్కరలేదు...నీ వాళ్ళకు అవసరం లేదు...మీకల్లా కావాల్సింది ధన సంబంధమే...దానికోసం ఎంతకైనా తెగిస్తారు...మీ అవసరం కోసం పెళ్ళాం పిల్లల్ని తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడరు...డబ్బు కోసం అమ్మానాన్నలనే విడదీయడానికి వెనుకాడని రక్త సంబంధాలు మీవి...ఆ బంధాలకు శత కోటి వందనాలు...!! ఎవరైనా మనకి సంతోషం లేక పోయినా పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూసి తరిద్దాం అనుకుంటారు...జనం దగ్గర నటించే నీకు పిల్లల ఆనందం ఎలా తెలుస్తుంది....?? నాకే కాదు వాళ్ళకు ఏ సంతోషాన్ని మిగల్చని నువ్వు...ఈ విలువ లేని వలువలు లేని జీవితం మాకు వద్దు..ఇకనైనా ఈ బతికినా నాలుగు రోజులు ప్రశాంతంగా బతకనివ్వు....నువ్వు మారవద్దు...నేను చేసిన తప్పుకి నా జీవితాన్ని దానిలోని ప్రతి చిన్న ఆనందాన్ని కోల్పోయాను...నమ్మిన నమ్మకానికి మీ బంధాలు అనుబంధాలు ఇచ్చిన బహుమతి చితి మీద కాలుతున్న నా మనసు కూడా గుర్తుగానే మిగుల్చుకుంటుంది..!! మోసపోయిన బతుకుని తలచుకుంటూ...!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"ఓ మోసగత్తెను నమ్మి .... ఓ అబద్దపు జీవికి జీవితాన్ని ఫణంగా పెడితే .... చివరికి మిగిలేది మోసపోయిన జీవితంలో ఊసరవెల్లుల కోలుకోలేని దెబ్బలు, మనసు రోదన మనిషి వేదన .... అందరిలా అన్ని ఆలోచనలు ఉండి అందరిలానే ఉంటే (నా) జీవితం (కూడా) బావుండేదేమో .... అసలు కోరికలు లేక పోవడం కూడా ఒక తప్పేనేమో .... ఎవరైనా మనకి సంతోషం లేక పోయినా పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూసి తరిద్దాం అనుకుంటారు ...."
నమ్మకం నిజాయితీ సమర్పణాభావం మనిషి జీవితం లో మనో సంఘర్షణకు కారణం. అనుభవమే కావొచ్చు. గమనించీ ఉండొచ్చు. మంచితనానికి మంచితనం తోడు కానప్పుడు జీవితం ఎంత సంఘర్షణామయం అవుతుందో అక్షరాల్లో చూస్తున్నానిక్కడ. అనుక్షణం అనుమానించి ఎవరికీ దగ్గర కాలేక అలాగ అని నూరేళ్ళ జీవితాన్ని కోల్పోలేక మనసు పడే వేదన మీ పోస్టింగ్ ద్వారా చాలా గొప్పగా విడమర్చారు. మీ ఉద్వేగ పూరిత అక్షరాలు మనిషి ఆలోచనా సరళిలో మార్పుకు కారణం కావాలని కోరుకుంటున్నాను.
శుభోదయం మంజు గారు!
ధన్యవాదాలు చంద్రగారు మీ చక్కని విశ్లేషణకు ... అక్షరాలతో మనుష్యుల మనసులు మార్చగాలమని అనుకోవడం కొందరి విషయంలో అడియాసే అండి... :)
మనుష్యులు మాటలతో, రాతలతో మారుతారో లేదో కానీ, మా మంజు వంటి ఆత్మ స్థైర్యం కలిగిన వ్యక్తిని చూసి కొంచమైనా మారుతారు.
మంజూ అభినందనలురా.
మీ అభిమానం ముందు తలను వంచుతున్నా
అక్కా ...!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి