10, డిసెంబర్ 2013, మంగళవారం

ఎదురు చూపులే చివరికి....!!

మాయని మమతల మాటున దాగిన
మౌన హృదయం గాయపడి బేలగా
రోదిస్తోంది  నీ నిర్లక్ష్యానికి చిరునామాగా...!!

పొంగిన ప్రేమ వెల్లువలో మునిగిన మనసు
ఊపిరందక ఉక్కిరి బిక్కిరై కొట్టుకుపోతూ
నీ ఆసరా కోసం ఆశగా చూస్తూనే ఉంది....!!

కాలాలు గడచినా యుగాలు మారినా
మారని తన తలరాతను నిందించుకుంటూ
రాని నీ కోసం ఎదురు చూస్తూనే ఉంది....!!

నీ సహవాసాన్ని గుర్తు చేసుకుంటూ
నీ జ్ఞాపకాల సాహచర్యంలో బతికేస్తూ
నీ గురుతులతో స్నేహం చేస్తూనే ఉంది అనుక్షణం...!!

ఓ జీవిత కాలాన్ని వెచ్చించి
మరో కొత్త జీవితానికి నాందిగా
నీతో పయనమైతే మధ్యలోనే విసిరి వేసిన ఈ బంధానికి...
ఎదురు చూపుల నిరాశలే చివరికి....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

మాయని మమతల మాటున ఓ మౌన హృదయం బేలగా రోదిస్తోంది. ప్రేమ వెల్లువలో ఊపిరందక ఉక్కిరి బిక్కిరై కొట్టుకుపోతోంది .... ఆసరా కోసం. తన తలరాతను నిందించుకుంటూ .... జ్ఞాపకాల సాహచర్యంలో .....
ఈ బంధానికి...ఎదురు చూపుల నిరాశలేనేమో చివరికి ....
స్నేహం, ప్రేమ, మనసు ముడుల సంఘర్షణల .... విశ్లేషణ చాలా చాలా బాగా రాసారు.
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు ... చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner