4, డిసెంబర్ 2013, బుధవారం

మరుజన్మకు చేరువగా...!!

చేజారిన వలపు చెలిమిని 
వదలలేని మనసు తపన
ఊపిరికందని శ్వాసలో చేరి
శిలగా మిగిలిన నా మదిలో
చెరగని చెదరని సజీవ జ్ఞాపకానివై
నిలిచిన నీ కోసం మిగిలున్నా...!!

నీతో పంచుకున్న స్నేహ పారిజాతాలు
ఇంకా గుభాళిస్తూనే ఉన్నాయి నా చుట్టూ
దూరమైన నీ సాంగత్యం మరువలేకున్నా
చేరువ కాని నీతోనే ఉండాలనుకుంటున్నా
నిరంతరం నీతోనే నా పయనం సాగనీ
ఇలా మరుజన్మకు చేరువగా...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

మరువలేని వారి సాంగత్యం, సాన్నిహిత్యం మరుజన్మలోనైనా సరే అని తపిస్తూ .... శిలగా మిగిలిన ఆమె మదిలో, చేజారిన వలపు అతను!
ప్రేమ భావనల సంద్రం లో అలల ఆవేశం లా మనోభావనల లోతు అనంతం అని ఈ కవిత లో స్పష్టం గా రాసారు
కవిత చాలా బాగుంది. అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

అందమైన మీ ఆత్మీయ విశ్లేషణా స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner