
ఒకప్పుడు కలం స్నేహం అంటే ఓ చక్కని అనుభూతి ఉండేది దానిలో... భావాలను పంచుకుంటూ...ఇప్పటి ముఖ పుస్తక స్నేహాలు, పోకళ్ళు ( అన్యధా భావించకండి అందరు కాదండి కొందరు మాత్రమే) చూస్తుంటే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి...!! మన ఇంట్లో అన్ని ఉన్నా మళ్ళి దేనికోసమో పాకులాటలు...వెధవ నటనలు, జాలి మాటలు, పొగడ్తలు...ఇలా వీటిలో దేనికో ఒకదానికి మోసపోయి వాళ్ళ ఉచ్చులో పడక పోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు...వ్యక్తిత్వం అనేది అందరికి ఉంటుంది...అది మన ఒక్కరి సొత్తేం కాదు...!! మన కున్న అనాగరికమైన ఆలోచనలు ఎదుటి వారికి ఉంటాయనుకోవడం మన భ్రమ..!! ఇష్టాలు, అభిప్రాయాలు, మనస్తత్వాలు...ఇలా కొన్ని కొందరిలో నచ్చుతాయి...కొన్ని నచ్చవు..ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది....మనకు నచ్చని వారందరూ చెడ్డవారు కాదు.. అలా అని మనకు నచ్చిన వారందరూ మంచివారు అని చెప్పలేము...కొందరు మన దగ్గర మంచి వారిగా నటించవచ్చు...మన వేమన గారు ఎప్పుడోనే చెప్పినట్టు మేడి పండు చూడ మేలిమై ఉండు...పొట్ట విప్పి చూడ పురుగులుండు....ఎంత నిజం ఇది...!! మనిషిని చూడగలం కాని లోపలి మనసుని చూడలేము కదా....!! చూసే సరికే చాలా జరగాల్సిన నష్టం జరిగి పోతుంది...అందుకే నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతుంటే సరి.... భావాలను పంచుకోండి...బందాలను పెంచుకోండి... భాద్యతలను మరువకండి...వయసును దానికి ఉన్న విజ్ఞాతా విలువలను అవహేళన కాకుండా చూడండి....మన కోసం మరొకటి జీవితాన్ని, ఆలోచనలను నాశనం చేయాలన్న ఆలోచనలను వదిలేస్తూ....ఎవరి కోసమో కాకుండా మన కోసం మనకంటూ కాస్త సమయాన్ని పంచుకుంటూ...మనని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఇష్టాలు, అభిప్రాయాలు, మనస్తత్వాలు...ఇలా కొన్ని కొందరిలో నచ్చుతాయి...కొన్ని నచ్చవు..ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది....మనకు నచ్చని వారందరూ చెడ్డవారు కాదు.. అలా అని మనకు నచ్చిన వారందరూ మంచివారు అని చెప్పలేము...కొందరు మన దగ్గర మంచి వారిగా నటించవచ్చు....
నిజం! చాలా బాగా వివరించారు.
అభినందనలు మంజు యనమదల గారు!
ధన్యవాదాలు చంద్ర గారు మీ ఆత్మీయ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి