9, డిసెంబర్ 2013, సోమవారం

ఆత్మీయతకు మారు పేరుగా...!!

ఏ పరిచయం ఎటు పోతుందో....!!
ఏ  స్నేహం ఏ దారంట వెళుతుందో...!!
తెలియని మలుపుల సుడిలో కొట్టుకు పోతాయో...!!
ఎవరి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయో తెలియక....ఎందుకొచ్చిన మనకు తెలియని పరిచయాలు పెంచుకోవడం...!! ఎవరి మనసులో ఏముందో ఆ పరమాత్ముడి కెరుక...మర్యాద మన్నన అనేవి ఇచ్చి పుచ్చుకునే ఆభరణాలు ఏ సంస్కృతిలోనైనా...!! మనసులో తప్పుడు ఆలోచనలు మనిషిని కలుషితం చేస్తాయి...మనకు ఉన్న ఆలోచనలే ఎదుటి వారికి ఉంటాయనుకోవడం చాలా తప్పు..ఎదుటి వారిని బట్టి మన మాటలు చేతలు ఉండాలి  కాని మనకు నచ్చినట్టు మాట్లాడేసి హమ్మయ్య మన పని అయిపొయింది అనుకోకూడదు...మనని మనం మోసం చేసుకున్నా క్షమించవచ్చు కాని...ఎదుటి వారిని మోసం చేయడం చాలా తప్పు...మీరు అనవచ్చు మోసపోతేనే కదా మోసం చేయగలిగేది అని.. మనం చేసేది మోసం కాదు వారిలోని నమ్మకాన్ని మోసం చేస్తున్నాం అని...!! అన్ని ఉన్నా ఇంకా దేనికోసమో వెంపర్లాట..దానికోసం సవాలక్ష అబద్దాలు...!! ప్రేమంటూ ఒకరు..ఇష్టమంటూ ఒకరు ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు భిన్న మనస్తత్వాలు...వ్యక్తిని, విజ్ఞతను అభిమానించండి తప్పులేదు అంతే కాని ఎదుటి వారి మనసుతో కాని, జీవితంతో కాని ఆడుకోకండి...మన పరిధి ఎక్కడో అక్కడే ఉంటే అందరికి ఆనందదాయకం..!! ఎవరి ఇష్టం వారిది అంతే కాని మన ఇష్టాలను బలవంతంగా వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయవద్దు...
దానివల్ల దూరం పెరిగి ఈ దారపు బంధాలు పుటుక్కున తెగిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది...!! ఏ పరిచయమైనా అందరికి సంతోషంగా ఆమోదయోగ్యంగా ఉండాలి కాని...హేళన చేయించుకునేదిగా ఉంటూ అపహాస్యం పాలు కాకూడదు...మన వయసుకు తగినట్టు హుందాగా...సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా చక్కని నడవడితో...ప్రవర్తన అందరికి మంచిది...!! అది పది కాలాలు పదిలంగా అందరి హృదయాల్లో నిలిచి పోతుంది.. ఆత్మీయతకు మారు పేరుగా...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"ప్రేమ, ఇష్టం ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు భిన్న మనస్తత్వాలు .... వ్యక్తిని, విజ్ఞతను అభిమానించితే తప్పులేదు. ఎదుటి వారి మనసుతో కాని, జీవితంతో కాని ఆడుకుంటేనే .... మన పరిధి ఎక్కడో మనం అక్కడే ఉంటే అందరికి ఆరోగ్యదాయకం..."
నిజమే మంజు గారు! మీ భావనల్తో నేనూ ఏకీభవిస్తున్నాను.
ఆలోచన, విచక్షణా రహిత మానవ సంబంధాల పై విశ్లేషణ చాలా బాగుంది. అభినందనీయం!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అభిమాన స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner